పాత రూ.500నోట్లకు ఆఖరి అవకాశం
న్యూఢిల్లీ: అధిక విలువ కలిగిన నోట్లను రద్దు చేస్తూ పాత రూ.500నోట్ల చెల్లుబాటయ్యే ప్రదేశాలు, గడువును కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే పాత రూ.1000 నోట్ల చెల్లుబాటు గడువు ముగిసిపోగా.. రూ.500 నోట్ల చెల్లుబాటు గడువు కూడా సమీపిస్తోంది. ఈ నెల 15 తర్వాత మెడికల్ షాపుల్లో, ప్రభుత్వ సర్వీసుల చెల్లింపుల్లో పాత రూ.500 నోటును స్వీకరించరు. ఆ తర్వాత ఈ నెల 31వరకూ బ్యాంకుల్లో డిపాజిట్ కోసం స్వీకరిస్తారు. నూతన సంవత్సరం ప్రారంభం నుంచి కేవలం ఆర్బీఐ శాఖల్లో మాత్రమే పాత రూ.500నోట్లను తీసుకుంటారు.