
మెట్రోలో చెల్లింపులు మరింత సులభం...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హోల్‌సేల్ వ్యాపారంలో ఉన్న మెట్రో క్యాష్ అండ్ క్యారీ చిన్న వర్తకుల కోసం చెల్లింపులను మరింత సులభతరం చేసింది. డెబిట్, క్రెడిట్ కార్డులు, చెక్కులు, నెట్ బ్యాంకింగ్ విధానాన్ని ప్రోత్సహిస్తోంది. మొబైల్ వాలెట్‌తో సైతం చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు కంపెనీ ఎండీ అరవింద్ తెలిపారు. వర్తకుల మొత్తం లావాదేవీల్లో నగదు చెల్లింపులు 60 శాతం దాకా ఉంటాయని, పెద్ద నోట్ల రద్దుతో హోల్‌సేల్ వ్యాపారంపై ప్రభావం చూపిస్తోందని చెప్పారు.