న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్ కంపెనీ ఏజీఆర్ (సవరించిన స్థూల రాబడి) బకాయిలకు సంబంధించి శనివారం రూ.8,004 కోట్లు టెలికం విభాగానికి (డాట్)కు చెల్లించింది. గత నెల 17న ఈ కంపెనీ ఏజీఆర్ బకాయిల నిమిత్తం రూ.10,000 కోట్లు చెల్లించింది. మొత్తం మీద ఈ కంపెనీ చెల్లించిన ఏజీఆర్ బకాయిల మొత్తం రూ.18,004 కోట్లకు చేరింది. సుప్రీం కోర్టు తీర్పుననుసరించి ఈ మొత్తాలను చెల్లించామని భారతీ ఎయిర్‌టెల్ వెల్లడించింది.
కాగా డాట్ అంచనాల ప్రకారం ఎయిర్‌టెల్ కంపెనీ ఏజీఆర్ బకాయిలు రూ.35,586 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వానికి రూ.23,701 కోట్ల ఏజీఆర్ బకాయిలు వసూలయ్యాయి. భారతీ ఎయిర్‌టెల్ రూ.18,004 కోట్లు, వొడాఫోన్ ఐడియా రెండు దశల్లో రూ.3,500 కోట్లు, టాటా టెలి సర్వీసెస్‌రూ.2,197 కోట్లు చొప్పున చెల్లించాయి. (డాట్ను ఆశ్రయించిన వొడాఫోన్ ఐడియా)
చదవండి: చార్జీల వడ్డన: జియోకు భారీ షాక్
Comments
Please login to add a commentAdd a comment