న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ స్టార్టప్ ‘ఫిన్‌కేస్’ బీమా ప్రీమియం చెల్లింపుల కోసం రుణ సాయాన్ని అందిస్తోంది. 2025 మార్చి నాటికి ఇలా 10 లక్షల మంది హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలుదారులకు రుణ సాయాన్ని సమకూర్చాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు తెలిపింది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను గడువులోపు చెల్లించడం తప్పనిసరి.
పైగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను నెలవారీ లేదా త్రైమాసిక వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉండదు. ఏడాదికి ఒకే ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అంత ప్రీమియం ఒకేసారి చెల్లించడం చాలా మందికి భారంగా అనిపిస్తుంది.
అలాంటి వారికి ఈ సంస్థ రుణ సదుపాయాన్ని అందిస్తోంది. అలాగే, ఆర్థిక ఆస్తులపైనా రుణాలను సమకూరుస్తుంటుంది. ఫిన్‌కేస్ అందించే రుణంతో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను చెల్లించి.. ఆ తర్వాత నెలవారీ ఈఎంఐ రూపంలో తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. డిజిటల్ ఇన్సూరెన్స్‌లో వెటరన్ అయిన అలోక్ భటా్నగర్‌ను ఆపరేషన్స్ హెడ్‌గా నియమించుకుంది. కాగా, దేశంలో 51.4 కోట్ల మంది హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణలో ఉన్నట్టు ఫిన్‌కేస్ తెలిపింది. ఇందులో కేవలం 10 కోట్లు మాత్రమే రిటైల్ హెల్త్ పాలసీలని (సొంతంగా తీసుకున్నవి) పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment