Biker Saved By His Helmet Twice In Road Accident - Sakshi
Sakshi News home page

పొద్దునే లేచి ఎవరి ముఖం చూశాడో.. అదృష్టమంటే నీదే భయ్యా!

Published Fri, Sep 16 2022 11:15 AM | Last Updated on Fri, Sep 16 2022 11:50 AM

Biker Saved By His Helmet Twice In Road Accident - Sakshi

ఎన్నో ప్రమాదాల్లో హెల్మెట్‌ చాలా మంది ప్రాణాలను కాపాడింది. పోలీసులు సైతం బైకర్లు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని హెచ్చరిస్తూనే ఉంటారు. ఇక, హెల్మెట్‌ పెట్టుకోని వారికి జరిమానాలు సైతం విధిస్తుంటారు. తాజాగా ఓ షాకింగ్‌ వీడియోను ఢిల్లీ పోలీసులు సోషల్‌ మీడియాలో​ షేర్‌ చేశారు. హెల్మెట్‌ అవసరాన్ని మరోసారి గుర్తు చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. 

వీడియో ప్రకారం.. ఓ బైక్‌పై హెల్మెట్‌ ధరించి వెళ్తున్నాడు. ఇంతలో బైక్‌ ముందు వెళ్తున్న ఓ కారు సడెన్‌గా టర్న్‌ తీసుకోబోయింది. దీంతో, బైకర్‌ ఒక్కసారిగి బ్రేక్‌ వేయడంతో ఎగిరి కిందపడ్డాడు. బైక్‌ ముందుకు దూసుకెళ్లి పక్కనే డివైడర్‌పైనున్న ఓ కరెంట్‌ పోల్‌ను ఢీకొట్టింది. ఈ సందర్భంలో బైకర్‌ హెల్మెట్‌ పెట్టుకోవడంతో కిందపడినా తలకు గాయంకాలేదు. కాగా, రోడ్డుపై నుంచి బైకర్‌ లేచినిల్చున్నాడు. 

లేచిన వెంటనే బైక్‌ ఢీకొట్టిన కరెంట్‌ పోల్‌ బైకర్‌ తలపై పడిపోయింది. దీంతో, అతడు పెట్టుకున్న హెల్మెట్‌ రెండు ముక్కలైంది. కాగా, ఈ రెండు సందర్భాల్లో హెల్మెట్‌ సదరు బైకర్‌ ప్రాణాలను కాపాడింది. ఇక, రోడ్‌ సేఫ్టీపై ఢిల్లీ పోలీసులు ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ క్రమంలో వీడియోకు.. హెల్మెట్‌ పెట్టుకున్న వారికి దేవుడు సాయం చేస్తాడు అని క్యాప్షన్‌ పెట్టారు. కాగా, ఈ వీడియో​ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement