
ఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉదృతికి ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ మర్కజ్ తబ్లిగీ జమాత్ సమావేశం ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం తర్వాతనే భారత్లో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిపోయాయి. తాజాగా ఈ సమావేశంలో పాల్గొన్న 60 మంది మలేషియన్లు దేశం విడిచి వెళ్లే ముందు ఒక్కొక్కరు రూ. 7 వేలు జరిమానా చెల్లించాలంటూ ఢిల్లీ హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. (కరోనా : దేశంలో సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదు)
కాగా కరోనా నేపథ్యంలో వీసా నిబంధనలతో పాటు భారత ప్రభుత్వం మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు గానూ విదేశీయులపై కేసులు నమోదయ్యయి. తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న 36 దేశాలకు చెందిన 956 మంది విదేశీ పౌరులపై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు 48 వేర్వేరు చార్జిషీట్లతో పాటు 11 అనుబంధ చార్జిషీట్లను దాఖలు చేసింది. వీరిలో మలేషియాకు చెందిన 122 మంది కూడా ఉన్నారు. కాగా మంగళవారం 122 మంది మలేషియన్ పౌరులకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిలో భాగంగా కోర్టు ముందుగా 60 మంది మలేషియన్లకు రూ. 7వేల జరిమానా విధించింది.
Comments
Please login to add a commentAdd a comment