Malaysians
-
తబ్లిగీ జమాత్ : 60 మంది మలేషియన్లకు జరిమానా
ఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉదృతికి ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ మర్కజ్ తబ్లిగీ జమాత్ సమావేశం ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం తర్వాతనే భారత్‌లో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిపోయాయి. తాజాగా ఈ సమావేశంలో పాల్గొన్న 60 మంది మలేషియన్లు దేశం విడిచి వెళ్లే ముందు ఒక్కొక్కరు రూ. 7 వేలు జరిమానా చెల్లించాలంటూ ఢిల్లీ హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. (కరోనా : దేశంలో సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదు) కాగా కరోనా నేపథ్యంలో వీసా నిబంధనలతో పాటు భారత ప్రభుత్వం మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు గానూ విదేశీయులపై కేసులు నమోదయ్యయి. తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న 36 దేశాలకు చెందిన 956 మంది విదేశీ పౌరులపై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు 48 వేర్వేరు చార్జిషీట్లతో పాటు 11 అనుబంధ చార్జిషీట్లను దాఖలు చేసింది. వీరిలో మలేషియాకు చెందిన 122 మంది కూడా ఉన్నారు. కాగా మంగళవారం 122 మంది మలేషియన్ పౌరులకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిలో భాగంగా కోర్టు ముందుగా 60 మంది మలేషియన్లకు రూ. 7వేల జరిమానా విధించింది. -
విదేశీ ఖైదీల విడుదల
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ఫీల్ ది జైల్’లో భాగంగా సంగారెడ్డి జిల్లా పాత కేంద్ర కారాగారంలో రెండు రోజుల పాటు గడిపిన ఇద్దరు మలేషియా దేశస్తులు సోమవారం విడుదలయ్యారు. రోజుకు రూ.500 చొప్పున చెరో రూ.వేయి చెల్లించిన వీరు జైలు జీవితాన్ని అనుభవించారు. జైలులో సాధారణ ఖైదీలకు కల్పించే సౌకర్యాలనే జైలు అధికారులు వీరికి కూడా కల్పించారు. ప్రపంచంలో ఈ రకమైన అవకాశం ఎక్కడా లేనందునే.. ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుని మరీ వచ్చామని ‘సాక్షి’కి వెల్లడించారు. మలేషియాకు చెందిన దంత వైద్యుడు క్వెన్, రెస్టారెంట్ యజమాని కెల్విన్ ఇద్దరూ స్నేహితులు. మలేషియాలోని జైలు మ్యూజియాన్ని సందర్శించిన వీరు ఇతర దేశాల్లోనూ జైలు మ్యూజియాల గురించి ఇంటర్నెట్లో శోధించారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగారం (పాత)లో ‘ఫీల్ ది జైల్’ అనే వినూత్న అవకాశం ఉన్నట్లు తెలిసింది. జైలు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ రాయ్‌ను ఫోన్లో సంప్రదించిన వీరు.. ఫీల్ ది జైల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన వీరు.. ఈ నెల 27న సంగారెడ్డికి చేరుకుని ‘ఫీల్ ది జైల్’ కోసం రూ.500 చొప్పున రెండు రోజుల కోసం ఇద్దరూ కలిసి రూ.2వేలు రుసుం చెల్లించారు. అనంతరం జైలు అధికారులు వీరికి సాధారణ ఖైదీల తరహాలో దుస్తులు, దుప్పట్లు తదితర సామగ్రి అందజేశారు. రెండు రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించిన ఈ ఇద్దరూ సోమవారం ఉదయం విడుదలయ్యారు. ఈ సందర్భంగా తమ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. బయటి ప్రపంచంతో సంబంధం లేదు.. ‘సాధారణ ఖైదీల తరహాలోనే రెండు రోజుల పాటు జైలు దుస్తులు ధరించాం. ఖైదీలకు ఇచ్చే అన్నం, పప్పు జిల్లా జైలు నుంచి తెప్పించి అందించారు. ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించలేదు. సెల్‌ఫోన్, ఇతర కమ్యూనికేషన్ సాధనాలేవీ మాతో పాటు అనుమతించలేదు. దినచర్యలో భాగంగా మొక్కలకు నీళ్లు పట్ట డం, జైలు ఆవరణ శుభ్రం చేయడం వం టి పనుల్లో పాల్గొన్నాం. రెండు రోజుల పాటు ఒక ఇంగ్లిష్ దినపత్రికను అందించారు. 48 గంటల పాటు మేం అనుభవించిన జైలు జైవితాన్ని ఇంటర్నెట్ ద్వారా పంచుకునే ప్రయత్నం చేస్తాం. ఐదురోజుల పర్యటనలో భాగంగా రెండు రోజులు జైలులో గడిపాం. మరో మూడురోజులు హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి స్వదేశానికి తిరిగి వెళ్తాం’ అని వెల్లడించారు. కాగా ఫీల్ ది జైల్లో ఇప్పటి వరకు 47 మంది తమ పేర్లు నమోదు చేసుకోగా, ఇందులో ఏడుగురు మహిళలు సైతం ఉన్నారు. కర్ణాటక, మహా రాష్ట్ర తదితర ప్రాంతాలకు చెందిన వారు కూడా రాగా, తొలిసారి ఇద్దరు విదేశీయులు వచ్చినట్లు జైలు అధికారులు తెలిపారు. -
మా దేశం విడిచి మీ దేశానికి వెళ్లొద్దు
-
మా దేశం విడిచి మీ దేశానికి వెళ్లొద్దు
-
మా దేశం విడిచి మీ దేశానికి వెళ్లొద్దు
మలేసియన్లపై ఉత్తరకొరియా తాత్కాలిక నిషేధం ప్యాంగ్యాంగ్: అమెరికా సహా ఏ దేశాన్నైయినా ధిక్కరించే ఉత్తరకొరియా.. మలేసియాతో తగువు పెట్టుకుంటోంది. ఇరు దేశాల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. తమ దేశం నుంచి మలేసియన్లు వెళ్లకుండా ఉత్తరకొరియా తాత్కాలిక నిషేధం విధించింది. మలేసియాలోని తమ దేశ పౌరులు, దౌత్యవేత్తల రక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంగళవారం ప్రకటించింది. ప్యాంగ్యాంగ్లోని మలేసియా దౌత్య కార్యాలయానికి ఉత్తరకొరియా విదేశీ వ్యవహారాల శాఖ ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ విషయం సానుకూలంగా పరిష్కారమవుతుందని, మలేసియాతో దౌత్యసంబంధాలు మెరుగవుతాయని ఆశిస్తున్నామని పేర్కొంది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరుడు (సవతి తల్లి కొడుకు) కిమ్ జోంగ్ నామ్ మలేసియా రాజధాని కౌలాలంపూర్ విమానాశ్రయంలో దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. ఉన్ ఈ హత్య చేయించినట్టు ఆరోపణలు వచ్చాయి. నామ్ మృతదేహాన్ని అప్పగించే విషయంలో ఇరు దేశాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. మలేసియా ఉద్దేశ్యపూర్తకంగానే కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ, నామ్ మృతదేహానికి శవపరీక్షలు చేయడంపై ఉత్తరకొరియా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య వివాదం ఏర్పడిన నేపథ్యంలో మలేసియన్లు దేశం విడిచి వెళ్లకుండా ఉత్తరకొరియా నిషేధం విధించింది.