అమెరికా సహా ఏ దేశాన్నైయినా ధిక్కరించే ఉత్తరకొరియా.. మలేసియాతో తగువు పెట్టుకుంటోంది. ఇరు దేశాల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. తమ దేశం నుంచి మలేసియన్లు వెళ్లకుండా ఉత్తరకొరియా తాత్కాలిక నిషేధం విధించింది. మలేసియాలోని తమ దేశ పౌరులు, దౌత్యవేత్తల రక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంగళవారం ప్రకటించింది. ప్యాంగ్‌యాంగ్‌లోని మలేసియా దౌత్య కార్యాలయానికి ఉత్తరకొరియా విదేశీ వ్యవహారాల శాఖ ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ విషయం సానుకూలంగా పరిష్కారమవుతుందని, మలేసియాతో దౌత్యసంబంధాలు మెరుగవుతాయని ఆశిస్తున్నామని పేర్కొంది.
Published Wed, Mar 8 2017 7:26 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement