టీఆర్ఎస్లోకి బీఎస్పీ ఎమ్మెల్యేలు | BSP MLAs joins into TRS | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్లోకి బీఎస్పీ ఎమ్మెల్యేలు

Published Sun, Jun 1 2014 7:42 PM | Last Updated on Sat, Sep 2 2017 8:10 AM

BSP MLAs joins into TRS

హైదరాబాద్: తెలంగాణలో పూర్తి మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ బలం మరింత పెరిగింది. బీఎస్పీ ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప టీఆర్ఎస్లో చేరారు. ఆదివారం వీరిద్దరూ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను కలసి పార్టీలో చేరారు.

తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యయ్యేందుకే టీఆర్ఎస్లో చేరామని ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ ఆహ్వానం మేరకే పార్టీలో చేరామని తెలిపారు. మంత్రివర్గంలో చేరడంపై నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తెలంగాణలో అన్ని పక్షాలను ఏకం చేయడమే తమ లక్ష్యమని, అందుకే ఇంద్రకరణ్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారని టీఆర్ఎస్ నేత హరీష్‌రావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరపున ఇంద్రకరణ్ రెడ్డి, కోనప్ప గెలిచారు. తెలంగాణలో  119 అసెంబ్లీ స్థానాలకు గాను టీఆర్ఎస్ 63 సీట్లు గెల్చుకోగా తాజాగా ఆ సంఖ్య 65కు పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement