
మాజీ సర్పంచ్ రావు రవీంద్రను ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే కంబాల జోగులు
రాజాం/రణస్థలం: స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్‌సీపీలోకి చేరికలు జోరందుకున్నాయి. ముఖ్యంగా టీడీపీ నుంచి నాయకులు, కార్యకర్తలు వెల్లువలా వస్తున్నారు. సంతకవిటి మండలం గుళ్ళసీతారాంపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రావు రవీంద్రతోపాటు మరో 300 కుటుంబాలు ఆదివారం పార్టీలో చేరాయి. రాజాంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కంబాల జోగులు కండువా కప్పి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు.. ఇంకా పైడిభీమవరం పంచాయతీలోని వరిశాం గ్రామంలో మాజీ సర్పంచ్ లంకలపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో ముక్కుపాలవలస, దేవునిపాలవలస, పైడిభీమవరం, వరిశాం గ్రామాలకు చెందిన 150 టీడీపీ కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. టీడీపీ నాయకుడు చుక్క అచ్చిరెడ్డితోపాటు 10 కుటుంబాలు, టీడీపీ ఎంపీటీసీ మాజీ సభ్యుడు మైలపల్లి వెంకటేష్‌తోపాటు అల్లివలస గ్రామానికి చెందిన 125 మంది మొత్తం 285 టీడీపీ కుటుంబాలకు ఎమ్మెల్యే కిరణ్‌కుమార్ పార్టీ కండువా వేసి సాదరంగా వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment