
ఉగ్రవాదులుగా మారిన 125 మంది సైనికులు
మాతృదేశానికి అండదండగా నిలవాల్సిన రక్షణ సిబ్బంది శత్రువులతో చేతులు కలిపారు. ఏకంగా వెళ్లి వారితో జత కట్టారు. ఈ దృశ్యం అఫ్గనిస్థాన్లో ఆవిష్కృతమైంది
కాబుల్: మాతృదేశానికి అండదండగా నిలవాల్సిన రక్షణ సిబ్బంది శత్రువులతో చేతులు కలిపారు. ఏకంగా వెళ్లి వారితో జత కట్టారు. ఈ దృశ్యం అఫ్గనిస్థాన్లో ఆవిష్కృతమైంది. అయితే, అంతకుముందు వరుసగా మూడు రోజులపాటు వీరంతా ఉగ్రవాద సైన్యంతో పోరాటం చేయడం గమనార్హం. ఈ వివరాలను అఫ్గనిస్థాన్ ప్రభుత్వ అధికారులు తెలిపారు.
'మూడు రోజులపాటు త్రిగరన్ లోయలో తాలిబన్లతో పోరాటం చేసిన తర్వాత 125 మంది అప్గన్ సైనికులు తాలిబన్లలో చేరిపోయారు' అని స్పష్టం చేశారు. త్రిగరన్ వ్యాలీలో ఓడిపోయినందువల్లే సైన్యం వారితో చేరిపోయిందని చెప్పారు. మొత్తం ఆయుద్ధంలో 10 మంది రక్షణా సిబ్బంది, 20 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం త్రిగరన్ వ్యాలీ ఉగ్రవాదుల చేతిలోకి వెళ్లింది.