టీఆర్ఎస్లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు | 2 MLAs, 3 MLCs join in TRS | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు

Published Mon, Sep 1 2014 5:15 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

టీఆర్ఎస్లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు - Sakshi

టీఆర్ఎస్లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు

టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సమక్షంలో సోమవారం ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు చేరారు.

హైదరాబాద్: టీఆర్ఎస్లోకి మళ్లీ వలసలు జోరందుకుంటున్నాయి. టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సమక్షంలో సోమవారం ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు చేరారు.

టీఆర్ఎస్లో చేరిన వారిలో ఎమ్మెల్యేలు కనకయ్య, మదన్ లాల్.. ఎమ్మెల్సీలు  వెంకట్రావు, యాదగిరి రెడ్డి, రాజేశ్వరరావు ఉన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా టీఆర్ఎస్లో చేరనున్నారు. సనత్నగర్ టీడీపీ ఎమ్మెల్యే శ్రీనివాస యాదవ్ సోమవారం కేసీఆర్తో
సమావేశం కావడం చర్చనీయాంశమైంది. ఆయన కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్టు వార్తలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement