టీఆర్ఎస్లోకి మళ్లీ వలసలు జోరందుకుంటున్నాయి. టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సమక్షంలో సోమవారం ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు చేరారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో ఎమ్మెల్యేలు కనకయ్య, మదన్ లాల్.. ఎమ్మెల్సీలు వెంకట్రావు, యాదగిరి రెడ్డి, రాజేశ్వరరావు ఉన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా టీఆర్ఎస్లో చేరనున్నారు.