టీడీపీ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత చల్లా రవి కుమార్ పార్టీ సభ్వత్వానికి, పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర
టీడీపీకి ‘చల్లా’ గుడ్‌బై
Published Sun, Feb 9 2014 3:13 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్ : టీడీపీ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత చల్లా రవి కుమార్ పార్టీ సభ్వత్వానికి, పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధినేత చంద్రబాబుకు రాజీనామా పత్రాన్ని పంపించినట్లు చల్లా రవి శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అంశంపై టీడీపీ తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు నచ్చకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో ఆదివారం ఆ పార్టీలో చేరతానని తెలిపారు. జిల్లాలో టీడీపీ పరిస్థితి దయనీయంగా ఉంది. కీలకమైన నేతలు పార్టీని వీడడం పార్టీ పెద్దలకు కలవరపరుస్తోంది. మండల స్థాయిలో పార్టీని బలపర్చి, జిల్లా పార్టీలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న చల్లా రవి పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం చర్చకు దారి తీసింది. ఆదివారం శ్రీకాకుళంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న సమైక్య శంఖారావం కార్యక్రమంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు చల్లా రవికూడా పార్టీలో చేరనున్నారు.
Advertisement
Advertisement