గుంటూరులో సుభానీని ఆహ్వానిస్తున్న నేతలు
నెహ్రూనగర్(గుంటూరు): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసాలను ప్రజలు గుర్తెరిగి రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అదివారం పశ్చిమ నియోజకవర్గం శ్రీనివాసరావుపేటకు చెందిన షేక్ సుభాని, అతని అనుచరులు, వెయ్యి మందికి పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ నగర అ«ధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి సమక్షంలో చేరారు. నేతలు కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రంపై నోరు మెదిపితే ఎక్కడ కేసుల్లో ఇరుక్కుంటామని భయంలో చంద్రబాబు ఉన్నారన్నారు. విజయవాడ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన మరలా రావాలంటే వైఎస్సార్ సీపీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో టీడీపీ ఆరాచక పాలన కొనసాగిస్తుందని పార్టీ నగర అ«ధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు.
పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆతుకూరి ఆంజనేయులు, రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్‌బాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గులాం రసూల్, రాష్ట్ర కార్యదర్శులు ధామస్‌నాయుడు, రాతంశెట్టి రామాంజనేయులు, ఈచంపాటి వెంకటకృష్ణ(ఆచారి), రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ జానీ, నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు గౌస్, జిల్లా కార్యదర్శి మార్కు కొండారెడ్డి, సత్యనారాయణ, సయ్యద్‌బాబు, దాసరి కిరణ్, పల్లపు శివ, గనిక ఝాన్సీ, అభియాదవ్, పెయింటర్ రమణ, తదితరులు పాల్గొన్నారు.
150 కుటుంబాలు చేరిక..
నూజెండ్ల: టీడీపీ కంచుకోటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాగా వేయడం శుభపరిణామమని ఆ పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పరిశీలకులు రావి వెంకటరమణ అన్నారు. మండలంలోని పాతనాగిరెడ్డిపల్లి, కొత్తనాగిరెడ్డిపల్లి గ్రామాల్లో టీడీపీకి చెందిన 150 కుటుంబాల వారు ఆదివారం నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారిని మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, జిల్లా నేతలు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్ వంకాయలపాటి బాలకోటయ్య, దిరిశాల కొండలు, పరిమి అంజయ్య, వంకాయలపాటి శ్రీను, చింతలచెర్వు బాబు, లేళ్ల అంజయ్య తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు నూతలపాటి హనుమయ్య, పాణ్యం హనిమిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్రకార్యదర్శి దూపాటి రాజారావు మండల కన్వీరర్ బత్తుల వెంకటేశ్వర్లు యాదవ్, కొమిరిశెట్టి రామారావు, గంధం బాలిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మూలె వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీలు ముప్పరాజు వెంకటేశ్వర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment