తిరుపతి: చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరుపతిలో శనివారం జరిగిన వైఎస్ఆర్ జనభేరి సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే జయదేవనాయుడు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుమార రాజ సహా కాంగ్రెస్ నేతలు పట్టాభిరెడ్డి, రమేష్, రవి వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
వైఎస్ఆర్ జనభేరికి జనం భారీ సంఖ్యలో హాజరయ్యారు. జగన్ రాక సందర్భంగా తిరుపతి రహదారులు జనసంద్రమయ్యాయి. పార్టీ కార్యకర్తలతో పాటు యువకులు, మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
వైఎస్ఆర్ సీపీలో చేరిన చిత్తూరు నేతలు
Published Sat, Mar 1 2014 7:40 PM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement
Advertisement