బీజేపీలో చేరిన దగ్గుబాటి పురందేశ్వరి | daggubati purandeswari joins into bjp | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 7 2014 8:35 PM | Last Updated on Wed, Mar 20 2024 12:51 PM

కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో చేరుతారంటూ వస్తున్న వార్తలు నిజమయ్యాయి. శుక్రవారం పురందేశ్వరి.. బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ నివాసంలో అగ్రనేతల సమక్షంలో పార్టీలో చేరారు. పురందేశ్వరినీ సీనియర్ నేతలు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో వెంకయ్య నాయుడు, రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు నిరసనగా కేంద్ర మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి పురందేశ్వరి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం నుంచి కాంగ్రెస్ తరపున రెండు సార్లు లోక్సభకు ఎంపికయ్యారు. ఆమె భర్త దగ్గుబాటి పురందేశ్వరి ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి కాంగ్రెస్ తరపునే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో వారిద్దరూ కాంగ్రెస్ను వీడారు. వచ్చే ఎన్నికల్లో పురందేశ్వరి విశాఖపట్నం నుంచే బీజేపీ తరపున బరిలోకి దిగవచ్చని భావిస్తున్నారు. వెంకటేశ్వరరావు మాత్రం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement