అనంతపురం టౌన్ : గృహ నిర్మాణ సంస్థలో జిల్లా వ్యాప్తంగా 42 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లను నియమించారు. జిల్లాకు ఎన్టీఆర్ రూరల్, హౌసింగ్ ఫర్ ఆల్ కింద ఇళ్లు మంజూరైనా క్షేత్రస్థాయిలో పురోగతి లేని నేపథ్యంలో వర్క్‌ఇన్‌స్పెక్టర్ల కొరత.. మందకొడిగా సాగుతున్న నిర్మాణాలపై డిసెంబర్ 9న ‘నిర్మాణమెలా?’ శీర్షికతో సాక్షి ప్రచురించిన కథనంపై స్పందించిన కలెక్టర్ కోన శశిధర్ హౌసింగ్ అధికారులతో సమీక్ష చేశారు.
ఓ ప్రైవేట్ ఏజెన్సీతో నియామకాలు చేపట్టాలని చూసినా అది సాధ్యం కాలేదు. జిల్లాలో నెలకొన్న పరిస్థితి మేనేజింగ్ డైరెక్టర్ దృష్టికి వెళ్లింది. అక్కడి నుంచి సానుకూలంగా నిర్ణయం రావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రశాంతి జిల్లా సమాఖ్య ద్వారా ఔట్‌సోర్సింగ్ కింద 42 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లను తీసుకున్నారు. శుక్రవారం వీరంతా విధుల్లో చేరారు. మరో 28 మందిని కూడా త్వరలోనే తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
వర్క్ ఇన్‌స్పెక్టర్ల నియామకం
Published Fri, Feb 3 2017 11:44 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement