
హైదరాబాద్ : వివిధ వృత్తుల నుంచి పలువురు ప్రముఖులు కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభపరిణామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రిటర్డ్ దూరదర్శన్ జాయింట్ డైరెక్టర్ సుజాత్ అలీ ఆధ్వర్యంలో క్రీడాకారులుగా పనిచేసి రిటెర్డ్ అయినవాళ్లు, డాక్టర్లుగా పనిచేసిన వారు, సోషల్ వర్కర్లు, రిటైర్డ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీకి 133 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. సెక్యులరిజం, సోషల్ జస్టిస్‌ను కాంగ్రెస్ పాటిస్తోందని వ్యాఖ్యానించారు.
2019లో ఢిల్లీలో, తెలంగాణలో కాంగ్రెస్ పక్కాగా విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. 70 ఏళ్ల స్వతంత్ర్యంలో ఏం తింటున్నావ్...లాంటి ప్రశ్నలు తాను వినలేదని, కానీ ఇప్పుడు వినాల్సి వస్తుందన్నారు. అందరికి సమాన ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీనేనని చెప్పారు. టీఆర్‌ఎస్ సర్కార్ వచ్చిన నాలుగు నెలల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు కానీ 40 నెలలు అయినా అమలు కాలేదని ఎద్దేవా చేశారు.
12 శాతం రిజర్వేషన్ పై సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలి..లేదంటే ముస్లింలను ఓట్లు అడిగే హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. ఓల్డ్ సిటీలో ఎందుకు మెట్రో పనులు మొదలు కాలేదని ప్రశ్నించారు. ఇది ఓల్డ్ సిటీ పై వివక్ష చూపడం కాదా..? అని అన్నారు. దళితులకు, గిరిజనులకు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఎంతమంది ముస్లింలకు డబుల్ బెడ్ రూములు కట్టించి ఇచ్చారని ప్రశ్నించారు. తుగ్లక్ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment