Vinesh Phogat points top cricketers silence for not supporting wrestlers protest - Sakshi
Sakshi News home page

#TopCricketers: 'గెలిస్తే చప్పట్లు కొట్టారు.. ఇప్పుడు మొహం చాటేశారు'

Published Fri, Apr 28 2023 4:42 PM | Last Updated on Fri, Apr 28 2023 5:03 PM

Vinesh Phogat Points-Top Cricketers-Silence Not-Supporting Protest - Sakshi

#WrestlersProtest..  లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ బ్రిజ్ భూష‌ణ్‌పై చ‌ర్యలు తీసుకోవాల‌ని టాప్ రెజ్లర్లు ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్‌ వద్ద  ఆరు రోజుల నుంచిధ‌ర్నా చేస్తున్న విష‌యం తెలిసిందే. మ‌హిళా అథ్లెట్లతో బ్రిజ్ భూష‌ణ్ ప్రవ‌ర్తన స‌రిగా లేద‌ని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నప్పటికీ.. క్రికెటర్ల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడం పట్ల రెజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతక విజేత రెజ్లర్‌ వినేష్ ఫోగట్‌ మాట్లాడుతూ.. దేశంలోని అగ్రశ్రేణి క్రికెటర్లపై అసంతృప్తి వెల్లగక్కారు. ఒలింపిక్స్‌, కామన్వెల్త్‌ వంటి గేమ్స్‌లో అథ్లెట్లు సాధించిన విజయాలను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టే క్రికెటర్లు.. ఈ విషయంపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించింది.

''దేశం మొత్తం క్రికెట్‌ను ఆరాధిస్తోంది. కానీ, ఒక్క క్రికెటర్‌ కూడా మా ఆందోళనపై మాట్లాడటం లేదు. పతకాలు గెలిచినప్పుడు చప్పట్లతో అభినందిస్తూ పోస్టులు పెట్టేవారు. కానీ ప్రస్తుతం  ఒక పెద్ద ఆందోళన జరుగుతుంటే మాత్రం మొహం చాటేశారు. వ్యక్తిగతంగా ఇది నన్నెంతో బాధిస్తోంది. మీరు రెజ్లర్లకు అనుకూలంగా మాట్లాడమని మేం చెప్పట్లేదు. కనీసం న్యాయం జరగాలంటూ ఒక్క పోస్ట్‌ అయినా పెట్టమని అభ్యర్థిస్తున్నాం. క్రికెటర్ అయినా, బ్యాడ్మింటన్ క్రీడాకారులు అయినా, అథ్లెటిక్స్, బాక్సర్ అయినా ముందుకొచ్చి మాకు మద్దతు తెలపండి'' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

అమెరికా లో ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’మూవ్‌మెంట్‌కు మన క్రికెటర్లు కొందరు మద్దతు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా వినేష్‌ ఫోగట్‌ గుర్తు చేసింది. ఆ మాత్రం మద్దతు పొందేందుకు మేం అర్హులం కామా..? అని నిలదీసింది. మా విషయంలో వారు ఎందుకు భయపడుతన్నారో అర్థం కావడం లేదని పేర్కొంది. క్రికెటర్లు వారి బ్రాండ్‌ ఒప్పందాలను ప్రభావితం చేస్తుందని భయపడుతున్నారో.. లేక వ్యవస్థను చూసి భయపడుతున్నారో తెలియట్లేదని వాపోయింది.  అలా కాకుండా మాకు జరిగినదే అక్కడ కూడా ఏదైనా జరుగుతోందేమో..? అంటూ అనుమానం వ్యక్తం చేసింది.

చదవండి: రెజ్లర్లు వీధుల్లోకి రావడం బాధించింది.. న్యాయం జరగాలి: హర్భజన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement