న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్ ను అరెస్టు చేసే వరకు... తాము విదేశీ టోర్నీల్లో పాల్గొనేది లేదని భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ తెలిపారు. ‘రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినా ఇంకా బ్రిజ్‌భూషణ్ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఫిర్యాదు చేసిన మహిళా రెజ్లర్ల నుంచి ఢిల్లీ పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డు చేయలేదు. విచారణకు రావాలని ఇంకా బ్రిజ్ భూషణ్‌కు నోటీసులు కూడా జారీ చేయలేదు.
కొన్నేళ్లుగా మా సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నించాం. కానీ ఎవరూ పట్టించు కోలేదు. గత జనవరిలో కేంద్ర క్రీడల మంత్రి అను రాగ్ ఠాకూర్ పర్యవేక్షక కమిటీని నియమించి ఈ వివాదాన్ని ముగించాలని చూశారు. అంతే తప్ప ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు’ అని వినేశ్ వ్యాఖ్యానించింది. జూన్ 1 నుంచి 4 వరకు కిర్గి స్తాన్‌లో జరిగే ర్యాంకింగ్ సిరీస్ టోరీ్నకి దూరంగా ఉన్నామని వినేశ్, బజరంగ్, సాక్షి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment