Supreme Court Notice On Wrestlers Plea Seeking FIR Against WFI Chief - Sakshi
Sakshi News home page

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు.. స్పందించిన అత్యున్నత న్యాయస్థానం

Published Tue, Apr 25 2023 12:19 PM | Last Updated on Tue, Apr 25 2023 12:30 PM

Supreme Court Notice On Wrestlers Plea Seeking FIR Against WFI Chief - Sakshi

న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ భారత అగ్రశ్రేణి రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం నోటీసు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఆటగాళ్లు చేసిన తీవ్రమైన ఆరోపణలను పేర్కొంటూ ఢిల్లీ పోలీసులు మరియు ఢిల్లీ ప్రభుత్వం నుండి ప్రతిస్పందన కోరింది.

లైంగిక వేధింపులపై వీడియో రికార్డింగ్‌లు ఉన్నా, ఏడుగురు మహిళలు వేధింపులకు గురయ్యారన్నా ఆధారాలు ఉన్నా ఎందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదని పోలీసులను ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయనందుకు పోలీసులను సైతం ప్రాసిక్యూట్ చేయాలని సూచించింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం మరోసారి విచారణ చేపట్టనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. బాధితుల తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement