న్యూఢిల్లీ: భారత్ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా... తమ నిరసనను ముగించేందుకు రెజ్లర్లు ఇష్టపడటం లేదు. జంతర్‌మంతర్ వద్ద శనివారం కూడా ఈ నిరసన కొనసాగింది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు రాజకీయ నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి ఆటగాళ్లకు తమ సంఘీభావం ప్రకటించారు.
అయితే కొందరు బయటి వ్యక్తులు నిరసన వేదిక వద్ద వచ్చి దుష్ప్రచారం చేస్తున్నారని రెజ్లర్ బజరంగ్ పూనియా ఆరోపించాడు. తమ ఉద్యమం రెజ్లర్ల సమస్యలకే పరిమితమని, ఇతర రాజకీయ అంశాల జోలికి తాము వెళ్లడం లేదని అతను అన్నాడు. మరో వైపు తాజా అంశంపై ‘ఫొగాట్’ సోదరీమణుల మధ్య విభేదాలు తలెత్తాయి. నిరసనలోకి రాజకీయ నాయకులను రానివ్వొద్దంటూ బబిత ఫొగాట్ విమర్శించగా... మహిళా రెజ్లర్ల తరఫున నిలవడం ఇష్టం లేకపోతే, కనీసం నిరసనను బలహీనపర్చవద్దని వినేశ్ జవాబిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment