న్యూఢిల్లీ: రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టు రెండు రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వగా... డబ్ల్యూఎఫ్‌ఐ అడ్‌హక్ కమిటీ స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్‌లకు నేరుగా ఆసియా క్రీడల బెర్త్‌లు ఖరారు చేసింది. మరోవైపు ఈ ఇద్దరు రెజ్లర్లకు కమిటీ ఇచి్చన మినహాయింపుపై విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జస్టిస్ అనిరుధ బోస్, జస్టిస్ ఎస్వీ భట్టిలతో కూడిన ద్విసభ్య బెంచ్ గతంలో గువాహటి హైకోర్టు విధించిన ‘స్టే’ను కొట్టివేసింది. వెంటనే ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాల్సిందిగా డబ్ల్యూఎఫ్‌ఐని ఆదేశించింది. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ రూ.. 25 వేల పూచీకత్తుపై బ్రిజ్‌భూషణ్‌కు, డబ్ల్యూఎఫ్‌ఐ సహాయక కార్యదర్శి వినోద్ తోమర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసి విచారణను గురువారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment