సాక్షి, ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన కేసు విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా కోర్టును ఆశ్రయించింది. దీంతో, ఈ కేసు విచారణ కోసం మార్చి 16వ తేదీన ఈడీ ఎదుట హాజరు కావాలని రౌజ్ ఎవెన్యూ కోర్టు ఆదేశించింది.
కాగా, కేజ్రీవాల్‌పై విచారణ విషయంలో ఈడీ.. ఢిల్లీ కోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణకు రావాలంటూ తాము పదేపదే సమన్లు పంపినా వాటిని తిరస్కరిస్తున్న కేజ్రీవాల్‌ఫై చర్య తీసుకోవాలని ఈడీ.. ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పలుమార్లు సమన్లు జారీచేసినా ఆయన హాజరుకావడం లేదని పిటిషన్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఆదేశాలు ఇవ్వాలని ఈడీ కోరింది. ఇప్పటికే ఎనిమిది సార్లు సమన్లు పంపినా వాటిని లెక్కచేయలేదని ఆరోపిస్తూ ఐపీసీ 174 సెక్షన్ కింద తాజాగా పిటిషన్ దాఖలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment