సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై విచారణ సెప్టెంబర్ 25కు వాయిదా పడింది. బుధవారం(సెప్టెంబర్11) ఈ విషయమై ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా విచారణ జరిపారు. ఈ విచారణ కోసం లిక్కర్ కేసు నిందితులు ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా ఇతర నిందితులు వర్చువల్‌గా హాజరయ్యారు.
లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవితకు ఇటీవలే సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. ఈయన బెయిల్ పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. సీబీఐ కేసులో బెయిల్ కోసం కేజ్రీవాల్ ఎదురుచూస్తున్నారు.
ఇదీ చదవండి.. వాల్మీకి స్కామ్‌లో మేం చెప్పిందే జరిగింది: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment