న్యూఢిల్లీ: తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత.. ఈడీ విచారణలో అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని మండిపడ్డారు. తన అక్రమ అరెస్టులపై న్యాయస్థానంలో పోరాడుతానని పేర్కొన్నారు.
కస్టడీ పొడిగింపు తర్వాత కవిత మాట్లాడుతూ.. తన అరెస్ట్ రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల అరెస్ట్ కక్షసాధింపేనని విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు. తనను ఈడీ కార్యాలయానికి తరలించే క్రమంలో కోర్టు ప్రాంగణంలో జై తెలంగాణ నినాదాలు చేశారు కవిత
కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గతవారం ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమెకు ఏడు రోజుల కస్టడీ విధించి రౌస్ అవెన్యూ కోర్టు. వారం రోజులపాటు కవితను విచారించిన ఈడీ అధికారులు.. నేడు తిరిగి కోర్టులో హాజరు పరిచారు.
అయితే కవిత విచారణకు సహకరించడం లేదని.. మరో ఐదు రోజుల కస్టడీ కావాలని ఈడీ కోర్టుకు తెలిపింది. ఇరువాదనలు విన్న న్యాయస్థానం.. ఈడీ కస్టడీ పొడిగింపుకు అనుమతించింది. కవిత ఈడీ కస్టడీ మరో మూడు రోజులు పొడిగించింది. ఈనెల 26 వరకు కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment