న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి షర్జీల్ ఇమామ్‌పై దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు సోమవారం పోలీసులను ఆదేశించింది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ఇమామ్ రెచ్చగొట్టే ప్రసంగం చేశాడని పేర్కొంది. జామియా మిలియా ఇస్లామియాలో 2019 డిసెంబర్ 13న, అలీఘర్ ముస్లిం వర్సిటీలో 2019 డిసెంబర్ 16న ఇమామ్ మాట్లాడుతూ.. అస్సాంను, ఈశాన్య భారతాన్ని భారత్ నుంచి వేరు చేస్తామని బెదిరించారని విచారణలో తేలిందంది. అంతకుముందు ఇమామ్ తానేం ఉగ్రవాదిని కాదని కోర్టుకు విన్నవించాడు. 2020 జనవరి నుంచి ఇమామ్ జుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో ద్వేషం, ధిక్కారం పెరిగేలా ఇమామ్ ప్రసగించాడని, ప్రజలను రెచ్చగొట్టాడని, దీని వల్ల 2019 డిసెంబర్‌లో హింస జరిగిందని ఢిల్లీ పోలీసులు అతనిపై చార్జ్ షీట్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment