న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలంటూ దాఖలైన ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ఢిల్లీ కోర్టు పోలీసులను ఆదేశించింది. సైనికుల రక్తం చాటున మోదీ దాక్కున్నారని, వారి త్యాగాలను స్వార్థానికి వాడుకుంటున్నారంటూ 2016లో ఓ కార్యక్రమంలో రాహుల్ వ్యాఖ్యానించారంటూ లాయర్ జోగిందర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు గాను రాహుల్‌పై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment