బెంగళూరు: పార్టీ అధ్యక్షుడిగా పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డానని, కర్ణాటకను కాంగ్రెస్‌కు ఇవ్వాలన్న లక్ష్యం సాధించానని, సీఎం ఎవరన్నదానిపై ఇక హైకమాండ్‌దే తుది నిర్ణయమని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఒకవైపు సీఎం అభ్యర్థిపై పార్టీ హైకమాండ్ మల్లగుల్లాలు పడుతున్న వేళ.. సీనియర్ నేత సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లడం తెలిసిందే. అయితే డీకే శివకుమార్ మాత్రం బెంగళూరులో ఉండిపోయారు.
ఇవాళ తన పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యుల నడుమ తన ఫామ్‌హౌజ్‌లో చేసుకున్నారాయన. అనంతరం బెంగళూరులోని నివాసానికి చేరుకున్నారు. అక్కడ మద్దతుదారులతో భేటీ అయిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.
కర్ణాటక పీసీసీ చీఫ్, సీఎం రేసులో ఉన్న డీకే శివకుమార్ తన ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించారు.‘‘ ఇవాళ నా పుట్టినరోజు. వేడుకల్లో పాల్గొనేందుకు ఇక్కడే ఉండిపోయా. తర్వాత ఢిల్లీకి వెళ్తా. పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డా. 15 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ధైర్యం కోల్పోలేదు. కాంగ్రెస్ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చాను. నా టార్గెట్ కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించడం. నా అధ్యక్షతన 135 స్థానాలు గెలిపించుకున్నా. గెలుపు కోసం నేతలంతా సహకరించారు.
.. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా. సిద్ధరామయ్యతో ఎలాంటి విభేధాలు లేవు. నా బర్త్‌డే వేడుకల్లో కూడా ఆయన పాల్గొన్నారు. సీఎం ఎవరన్నదానిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. నాకంటూ ఉన్న మద్దతు దారుల సంఖ్యను చెప్పను. ఎందుకంటే నేను ఒంటరిని.. ఒంటరిగానే పార్టీని గెలిపించుకున్నా. ఢిల్లీ వెళ్లి నా గురువును కలుస్తా. సీఎం అభ్యర్థి ఎవరు అనేదానిపై హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుంది. సోనియా, రాహుల, ఖర్గేలు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు అని శివకుమార్ పేర్కొన్నారు.
#WATCH | It's my birthday today, I'll meet my family. Afterwards,I'll leave for Delhi.Under my leadership,we've 135 MLAs, all in one voice said-matter (to appoint CM) is to be left to the party high command. My aim was to deliver Karnataka&I did it: K'taka Cong Pres DK Shivakumar pic.twitter.com/xlqvVCBLdv
— ANI (@ANI) May 15, 2023
ఇదీ చదవండి: ఇంతకన్నా కానుక ఏముంటుంది?-డీకే శివకుమార్
Comments
Please login to add a commentAdd a comment