Karnataka CM Announcement: Congress Chief Kharge Likely to Announce - Sakshi
Sakshi News home page

ఖర్గేతో ముగిసిన డీకేఎస్‌, సిద్ధూ భేటీ.. బెంగళూరులోనే సీఎం ఎవరనేది ప్రకటన!

May 16 2023 8:11 PM | Updated on May 16 2023 8:58 PM

Karnataka CM Announcement: Congress Chief Kharge likely to announce - Sakshi

కర్ణాటక సీఎం అభ్యర్థిపై నేరుగా ప్రకటన చేయనున్నారు ఖర్గే.. 

ఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగే ఛాన్స్‌ కనిపిస్తోంది. తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా.. సీఎం ఎంపికపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ చర్చోపచర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో డీకే శివకుమార్‌, సిద్ధరామయ్యలు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఇవాళ వరుసగా భేటీ అయ్యారు.  

తొలుత డీకే శివకుమార్‌, ఆపై సిద్ధరామయ్య ఖర్గేతో ఆయన నివాసంలో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఇద్దరూ చెరో గంటకుపైనే ఖర్గేతో చర్చించారు. ఈ క్రమంలో ఇద్దరూ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అయితే.. ఇద్దరితో సమాలోచనల సారాంశాన్ని సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతోనూ చర్చించాలని ఖర్గే భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఖర్గేతో భేటీ అనంతరం.. పార్టీ జనరల్‌ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌ నివాసానికి వెళ్లారు సిద్ధారామయ్య. 

ఇప్పటికే ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించిన పార్టీ పరిశీలకులు.. హైకమాండ్‌కు ఆ నివేదికను అందించారు. ఆపై ఇద్దరు అభ్యర్థులతో ఖర్గే విడివిడిగా భేటీ అయ్యారు. ఎమ్మెల​ఏల మద్దతు తనకే ఉందని సిద్ధరామయ్య, ఖర్గేతో చెప్పినట్లు తెలుస్తోంది. ఇక డీకే శివకుమార్‌ సోలోగా తాను పార్టీకి భారీ విజయాన్ని కట్టబెట్టినట్లు చెప్పినట్లు సమాచారం. కుదిరితే రేపు లేకుంటే ఎల్లుండి బెంగళూరులో కర్ణాటకకు కాబోయే సీఎం ఎవరనేదానిపై పార్టీ అధ్యక్షుడు ఖర్గే స్వయంగా ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement