ఢిల్లీ: మూడు రోజుల చర్చల తర్వాత.. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసిందనే ప్రచారం ఊపందుకుంది. ఈలోపు సాయంత్రం ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆ పేరును అధికారికంగా ప్రకటించడమే తరువాయి అంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ లోపు.. హస్తినలో ఇవాళ హాట్ హాట్ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
సీఎం పదవిని ఆశించిన డీకే శివకుమార్ తన సోదరుడితో కలిసి కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ అవ్వగా.. ఆయన మద్దతుదారులు నివాసం బయట నిరసనకు దిగారు. డీకే శివకుమార్‌కే ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలంటూ ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు వాళ్లు. దత్త పుత్రుడు కావాలా? అసలు పుత్రుడు కావాలా? అంటూ డీకేఎస్‌ను సీఎం చేయాలంటూ నినాదాలు చేశారు వాళ్లు.
పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి రావడానికి డీకేఎస్ కారణమని, ఆయనకు కాకుండా సీఎం పోస్ట్ ఎవరికి ఇచ్చినా ఆ నిర్ణయం చారిత్రక తప్పిదమే అవుతుందని వ్యాఖ్యానించారు వాళ్లు. ఒకపక్క సీఎంగా సిద్ధరామయ్య పేరు దాదాపు ఖరారు కావడంతో బెంగళూరులోని ఆయన నివాసం బయట ఫొటోకు పాలాభిషేకం చేశారు మద్దతుదారులు. దీనికి ప్రతిగానే డీకేఎస్ అనుచరగణం ఇలా రాహుల్ నివాసం బయట గుమిగూడినట్లు తెలుస్తోంది. రాహుల్‌తో భేటీ అనంతరం డీకే సోదరులు నేరుగా ఖర్గే నివాసానికి వెళ్లారు.
#WATCH | Supporters of Congress leader Siddaramaiah pour milk on his poster and chant slogans for him outside his residence in Bengaluru, even as the suspense over #KarnatakaCMRace continues. pic.twitter.com/HQG0gzsb1G
— ANI (@ANI) May 17, 2023
#WATCH | Karnataka Congress president DK Shivakumar leaves from 10, Janpath after meeting party leader Rahul Gandhi, as Karnataka CM decision remains pending pic.twitter.com/BvTTJG4T8T
— ANI (@ANI) May 17, 2023
ఇదీ చదవండి: జస్ట్ 16 ఓట్ల ఆధిక్యంతో నెగ్గిన బీజేపీ అభ్యర్థి
Comments
Please login to add a commentAdd a comment