డీకే శివకుమార్‌.. ఇదేనా మీ నీతి: కేటీఆర్‌ కౌంటర్‌ | KTR Serious Comments Over DK Shiva Kumar And Congress | Sakshi
Sakshi News home page

అధికారంలో బీఆర్‌ఎస్‌ లేకపోతే జరిగేది అదే: కేటీఆర్‌

Published Sat, Nov 4 2023 2:49 PM | Last Updated on Sat, Nov 4 2023 3:38 PM

KTR Serious Comments Over DK Shiva Kumar And Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు మంత్రి కేటీఆర్‌ కౌంటరిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు కర్ణాటక అడ్డాగా మారిందన్నారు. హైదరాబాద్‌కు వచ్చే కంపెనీలకు లేఖలు రాసి శివకుమార్‌ వాటిని బెంగళూరు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. 

కాగా, కేటీఆర్‌ శనివారం జలవిహార్‌లో తెలంగాణ న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్‌ మాట్లాడుతూ..‘ఫాక్స్ కాన్ కంపెనీకి గత నెలలో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌ లేఖ రాశారు. ఎంతో కష్టపడి మనం ఆ కంపెనీని తెలంగాణకు తీసుకొచ్చాం. ఫాక్స్ కాన్ సీఈవో కూడా ఇక్కడ కంపెనీ పెట్టీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కంపెనీ ప్రారంభానికి కొద్ది రోజుల సమయం ఉంది. కానీ, శివకుమార్ ఫాక్స్ కాన్ సీఈవోకి లేఖ రాసి ఆ కంపెనీ బెంగుళూరుకు మార్చండి అంటూ చెప్పాడు. సరే, కంపెనీ విషయంలో ఆశ పడుతున్నాడు అనుకోవచ్చు. 

కానీ, ఇంకా కొన్ని కామెంట్స్ చేశారాయన. త్వరలో తెలంగాణలో ఫ్రెండ్లీ ప్రభుత్వం వస్తుంది. అక్కడ ఉన్న ప్రముఖ కంపెనీలన్నీ బెంగళూరుకు మార్చేస్తాం అని లేఖలో రాసుకొచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీ, కర్ణాటక ప్రభుత్వం చేసే కుటిల ప్రయత్నం. తెలంగాణలో కేసీఆర్ లేకపోయినా, బీఆర్‌ఎస్ మరోసారి అధికారంలోకి రాకపోతే జరిగేది ఇదే. ఫ్రెండ్లీ గవర్నమెంట్ వచ్చాక ఇక్కడ కంపెనీలను అక్కడికి తీసుకువెళ్తారు. ఇక్కడ కాంగ్రెస్ నేతలకు బెంగుళూరు అడ్డాగా మారింది. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ వచ్చే ఉద్యోగాలు కూడా బెంగుళూరుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేనా మీ నీతి, నిజాయితీ’ అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇది కూడా చదవండి: మైనంపల్లి హన్మంతరావు ఓ రౌడీ: మంత్రి మల్లారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement