Ponguleti And Jupally To Join In Congress Party On June 22, Details Inside - Sakshi
Sakshi News home page

రాహుల్‌తో జూమ్‌ మీటింగ్‌.. 22న కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి, కూచుకుళ్ల!

Published Sat, Jun 17 2023 11:24 AM | Last Updated on Sat, Jun 17 2023 6:20 PM

Ponguleti Jupally to join Congress on June 22 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో అతిత్వరలో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 22వ తేదీన ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ఆయన కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌ గాంధీతో జూమ్‌ మీటింగ్‌లో మాట్లాడినట్లు సమాచారం. 

రాహుల్‌ గాంధీతో జూమ్‌ మీటింగ్‌లోనే పొంగులేటి చేరిక తేదీ ఫిక్స్‌ అయ్యింది. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సైతం పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక అదేతేదీన పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి సైతం కాంగ్రెస్‌లో చేరనున్నారు.

విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ ఈ నెల 21వ తేదీన ఢిల్లీకి చేరుకుంటారు. అదే తేదీన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సైతం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక జూపల్లి, పొంగులేటి చేరిక తర్వాత ఖమ్మం, పాలమూరుల్లో కాంగ్రెస్‌ పార్టీ భారీగా బహిరంగ సభ నిర్వహించే యోచనలో ఉంది.

ఇదీ చదవండి: బీఆర్‌ఎస్‌లో కూచుకుళ్ల అసంతృప్తికి కారణం అదే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement