
బెంగళూరు:కుంభమేళాకు వెళ్లడంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(డీకేఎస్) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కుంభమేళాకు వెళ్లి పవిత్ర స్నానమాచరించడం అనేది తన వ్యక్తిగత విషయమని చెప్పారు. ఈ మేరకు ఆయన బుధవారం(ఫిబ్రవరి5) మీడియాతో మాట్లాడారు. కుంభమేళాకు వెళ్తానని తాను చెప్పడంపై కర్ణాటక ప్రతిపక్షనేత ఆర్.అశోక్ చేసిన విమర్శలకు శివకుమార్ ఘాటుగా స్పందించారు.
ఏఐసీసీ చీఫ్ ఖర్గే కుంభమేళాపై చేసిన వ్యాఖ్యలకు తన కుంభమేళా పర్యటనకు లింకు పెట్టడంపై శివకుమార్ మండిపడ్డారు. అశోక్ కాదు ప్రధాని మోదీ, అమిత్ షా ఈ విషయంపై మాట్లాడితేనే తాను సమాధానం చెప్తానన్నారు.
గంగా,కావేరీ,కృష్ణా నదులు ఎవరికీ చెందినవి కాదని, నీటికి రంగు రుచి ఉండదన్నారు. అశోక్ తనపై కాదని, ప్రధాని కుంభమేళాకు వెళ్లి స్నానం చేసిన అంశంపై విమర్శలు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment