
బెంగళూరు: తన తమ్ముడు డీకే సురేష్‌ను కాల్చి చంపాలని బీఏపీ నేత ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. డీకే సురేష్ ఇలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తి కాదని, ఇలాంటివి తాము గతంలో చాలా చూశామన్నారు. వాటన్నింటని సెటిల్ చేశామని చెప్పారు.
కేంద్ర బడ్జెట్‌లో దక్షిణాదికి నిధులు సరిగా దక్కకపోవడంపై డీకే సురేష్ మాట్లాడుతూ దేశాన్ని ఉత్తర, దక్షిణ భారత దేశాలుగా విభజించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు దుమారాన్ని రేపాలయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఈశ్వరప్ప.. డీకే సురేష్, ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి లాంటి వాళ్లను కాల్చి చంపేందుకు చట్టం చేయాల్సిందిగా ప్రధాని మోదీకి చెబుతానన్నారు.
అయితే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే డీకే సురేష్ వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలను సమర్థించదని తేల్చి చెప్పారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ ఈశ్వరప్పకు కొట్టడం, తిట్టడం, కాల్చడం తప్ప ఏమీ తెలియదన్నారు.
ఈశ్వరప్పపై చట్టపరమైన చర్యలుంటాయని చెప్పారు. కాగా, డీకే సురేష్‌ను కాల్చి చంపాలన్నందుకు ఈశ్వరప్పపై బెంగళూరులో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దీనిపై ఈశ్వరప్ప స్పందిస్తూ జాతీయవాదం, హిందుత్వ అంశాల్లో తనపై వందల ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనా భయపడనని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి.. ముగిసిన 17వ లోక్‌సభ.. పార్లమెంట్ నిరవధిక వాయిదా