Eswarappa
-
Bengaluru: బెదిరింపులకు భయపడం: డీకే శివకుమార్
బెంగళూరు: తన తమ్ముడు డీకే సురేష్‌ను కాల్చి చంపాలని బీఏపీ నేత ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. డీకే సురేష్ ఇలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తి కాదని, ఇలాంటివి తాము గతంలో చాలా చూశామన్నారు. వాటన్నింటని సెటిల్ చేశామని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో దక్షిణాదికి నిధులు సరిగా దక్కకపోవడంపై డీకే సురేష్ మాట్లాడుతూ దేశాన్ని ఉత్తర, దక్షిణ భారత దేశాలుగా విభజించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు దుమారాన్ని రేపాలయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఈశ్వరప్ప.. డీకే సురేష్, ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి లాంటి వాళ్లను కాల్చి చంపేందుకు చట్టం చేయాల్సిందిగా ప్రధాని మోదీకి చెబుతానన్నారు. అయితే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే డీకే సురేష్ వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలను సమర్థించదని తేల్చి చెప్పారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ ఈశ్వరప్పకు కొట్టడం, తిట్టడం, కాల్చడం తప్ప ఏమీ తెలియదన్నారు. ఈశ్వరప్పపై చట్టపరమైన చర్యలుంటాయని చెప్పారు. కాగా, డీకే సురేష్‌ను కాల్చి చంపాలన్నందుకు ఈశ్వరప్పపై బెంగళూరులో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై ఈశ్వరప్ప స్పందిస్తూ జాతీయవాదం, హిందుత్వ అంశాల్లో తనపై వందల ఎఫ్ఐఆర్లు నమోదైనా భయపడనని స్పష్టం చేశారు. ఇదీ చదవండి.. ముగిసిన 17వ లోక్‌సభ.. పార్లమెంట్ నిరవధిక వాయిదా -
గుండె పోటుతో రైతు మృతి
తురకలాపట్నం(రొద్దం) : మండల పరిధిలోని తురకలాపట్నం గ్రామంలో రైతు ఈశ్వరప్ప(40) శనివారం గుండెపోటుతో మతి చెందారు. ఉదయం ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో ఆయన ఇంట్లోనే కుప్పుకూలిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఐకేపీ అధికారులు మతుడి కుటుంబానికి తక్షణసాయం కింద రూ.5 వేలు అందజేశారు. చంద్రన్న బీమా కింద ఆ కుటుంబానికి రూ.30 వేలు వస్తుందని, మిగిలిన రూ.25 వేలు భార్య సునందమ్మ ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. ఎంపీటీసీ కమలమ్మ, పంచాయతీ కార్యదర్శి శాంతి, బీమా మిత్ర అంజినమ్మ తదితరులు ఈశ్వరప్ప కుటుంబీకులకు సంతాపం తెలిపారు. -
మండలిలో ‘వక్ఫ్’ రగడ
బెంగళూరు: వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలోని దాదాపు రూ. 15 లక్షల కోట్ల విలువ చేసే 57వేల ఎకరాల భూములకు సంబంధించిన అవకతవకలపై శాసనమండలిలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన అవకతవకలపై అన్వర్ మానప్పాడి నేతృత్వంలోని సమితి ప్రభుత్వానికి అందజేసిన నివేదికను మండలిలో ప్రవేశపెట్టాలంటూ డిమాండ్ చేశాయి. ఇదే సందర్భంలో మండలిలో నివేదికను ప్రవేశపెట్టే వరకు సభను సాగనివ్వమంటూ వెల్‌లోకి దూసుకెళ్లి తమ నిరసనను తెలియజేశాయి. సోమవారం ఉదయం శాసనమండలి కార్యకలాపాలు ప్రారంభం కాగానే విపక్షనేత కె.ఎస్.ఈశ్వరప్ప మాట్లాడుతూ... వక్ఫ్ ఆస్తులకు సంబంధించి అన్వర్ మానప్పాడి ప్రభుత్వానికి అందజేసిన నివేదికను మండలిలో ప్రవేశపెట్టాల్సిందిగా చైర్మన్ ఆదేశించినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆ నివేదికను మండలిలో ప్రవేశపెట్టలేదని అన్నారు. వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలోని 57వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని, తద్వారా రూ.15 లక్షల కోట్ల మేరకు అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ భూములను కబ్జా చేసిన వారిని రక్షించుకునేందుకు ప్రభుత్వం పాకులాడుతోందని విమర్శించారు. ఈ సందర్భంలో శాసనమండలిలో అధికార పక్ష నేత ఎస్.ఆర్.పాటిల్ కలగజేసుకొని...‘ప్రజలు కడుతున్న పన్నులతో సభా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాంటి సభలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య, కరువు సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉంది. కానీ ఇవేవీ ప్రతిపక్షానికి పట్టడం లేదు. కేవలం రాజకీయాల కోసమే సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారు’ అని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య చాలా సేపు వాగ్వాదం నెలకొంది. అనంతరం రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర మాట్లాడుతూ...‘వందేళ్ల చరిత్ర ఈ సభకు ఉంది, సభ సరిగ్గా లేనపుడు ఇక చర్చలు జరపడం కూడా అనవసరం. ముందు సభా కార్యకలాపాలు సాగనివ్వండి. మీరు ఇచ్చిన రూలింగ్‌పై మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుందాం’ అని కోరారు. అయితే జయచంద్ర సమాధానంతో ప్రతిపక్షం శాంతించలేదు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత ఈశ్వరప్ప మాట్లాడుతూ....‘ఇప్పటికే మూడు సార్లు ఈ విషయంపై రూలింగ్ ఇచ్చాం, నివేదికను మీరు మండలిలో ప్రవేశపెడతారో లేదో స్పష్టంగా చెప్పి, నివేదికను ప్రవేశపెడతామని హామీ ఇస్తేనే మా పోరాటాన్ని నిలిపివేస్తాం. లేదంటే మా పోరాటం కొనసాగుతుంది’ అని హెచ్చరించారు. -
అధ్యక్షుడిగా యడ్యూరప్పే దీటైన వ్యక్తి
= రాష్ట్ర బీజేపీ పీఠం ఆయనకే ఇవ్వాలి = లోకాయుక్త నియామకంపై కాంగ్రెస్ ద్వంద్వ నీతి = విధాన పరిషత్ ప్రతిపక్ష నేత, మాజీ డీసీఎం ఈశ్వరప్ప బళ్లారి : రాష్ట్ర బీజేపీ అధ్యక్ష స్థానానికి మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ సభ్యుడు యడ్యూరప్పనే దీటైన వ్యక్తి అని మాజీ ఉప ముఖ్యమంత్రి, విధాన పరిషత్ ప్రతిపక్ష నేత కేఎస్ ఈశ్వరప్ప పేర్కొన్నారు. మంగళవారం ఆయన బళ్లారి నగరంలోని జిల్లా కోర్టుకు ఓ కేసు విచారణకు హాజరైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష స్థానం యడ్యూరప్పకే ఇవ్వాలని తనతో పాటు రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు అభిప్రాయ పడుతున్నారని గుర్తు చేశారు. ఆయన నాయకత్వలో రాష్ట్రంలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందనే విశ్వాసం ఉందన్నారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సక్రమంగా వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఉందన్నారు. రాష్ట్ర సీఎం నిద్ర మత్తులో ఉన్నారని ధ్వజమెత్తారు. వక్ఫ్ బోర్డులో రూ.2.40 కోట్ల మేర అవినీతి జరిగిందని, దీనిపై ఏర్పాటు చేసిన సమితి నివేదిక విధానసభ, విధాన పరిషత్‌కు సమర్పించినప్పటికీ ఏ విధమైన చర్యలు తీసుకోలేదని, దీనిపై హైకోర్టు కూడా నివేదిక అందజేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచిం చినప్పటికీ ఇంతవరకు అందజేయకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో సీ కేటగిరి గనులను వేలం వేయాలని సుప్రీంకోర్టు సూచించినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తోందని ధ్వజమెత్తారు. లోకాయుక్త నియాయకంపై రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ నీతి ప్రదర్శిస్తోందన్నారు. ఎమ్మెల్సీ శశీల్ నమోషి, మాజీ విధాన పరిషత్ సభ్యుడు మృత్యుంజయ జినగ తదితరులు పాల్గొన్నారు. -
నో డౌట్
కాంగ్రెస్ పార్టీ చివరిముఖ్యమంత్రి సిద్ధరామయ్యయే పరిషత్ విపక్షనాయకుడు కే.ఎస్ ఈశ్వరప్ప బెంగళూరు : ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకు సంబంధించి చివరి ముఖ్యమంత్రిగా మారనున్నారని శాసనమండలి విపక్షనాయకుడు కే.ఎస్ ఈశ్వరప్ప పేర్కొన్నారు. సువర్ణ విధానసౌధాలో మీడియాతో ఆయన బుధవారం మాట్లాడారు. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అక్రమాలకు కొదువే లేదన్నారు. దేశానికి తలమానికమైన లోకాయుక్త సంస్థ కూడా అవినీతిలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.వందల కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లోకాయుక్తను రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా ఏర్పాటైన రాష్ట్ర సాంఘిక సం క్షేమ శాఖలో రూ.వందల కోట్ల విలువ చేసే అక్రమాలు చోటు చేసుకున్నా దర్యాప్తునకు అధికార కాంగ్రెస్ పార్టీ అంగీకరించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇక అధికారంలోకి రావడానికి ముందు ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడతామని చెప్పిన కాం గ్రెస్ పార్టీ ఈ విషయంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఈ విషయాల న్నింటినీ ప్రజలు నిషిత దృష్టితో గమనిస్తున్నారని తెలిపారు. అందువల్ల రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గల్లంతవ్వడం ఖాయమని అన్నారు. ఇక ఎప్పటికీ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రాదని పేర్కొన్నారు.