సాక్షి, ఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెలువడి నాలుగు రోజులు గడిచినా కానీ, సీఎం ఎవరన్నదానిపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోయింది. అయితే, ఎట్టకేలకు బుధవారం.. ఉత్కంఠకు తెరపడింది. సిద్ధూకు ఒకే అన్న కాంగ్రెస్ అధిష్టానం.. మరికాసేపట్లో ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.
కాగా, ముందుగా ఢిల్లీ వెళ్లిన సిద్ధరామయ్య.. ఖర్గేతో మంగళవారం ఓ దఫా చర్చలు జరిపారు. నిన్న ఉదయం కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఢిల్లీ వెళ్లి ఖర్గేతో సమావేశమై చర్చలు జరిపారు. నిన్న మల్లికార్జున్ ఖర్గే నివాసంలో నిరంతరం సమావేశాలు, చర్చలు జరిగినా ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయారు.
కాగా, రాహుల్ గాంధీతో సిద్దరామయ్య బుధవారం సమావేశమయ్యారు. అరగంట పాటు రాహుల్‌తో చర్చించారు. సిద్ధరామయ్య వైపే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు మధ్యాహ్ననికి క్లారిటీ రాగా, సాయంత్రానికి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రొటేషన్ సీఎం ఫార్ములాను కాంగ్రెస్ హైకమాండ్ సూచిస్తోంది. డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉంది. రాహుల్‌గాంధీని డీకే శివకుమార్ కూడా కలిశారు. కర్ణాటక సీఎం అభ్యర్థిపై అధిష్టాన నిర్ణయాన్ని డీకేకి రాహుల్ తెలిపారు.
చదవండి: కాషాయ పార్టీకి షాకిచ్చిన ఆ ఓటర్లు.. కాంగ్రెస్‌కు కలిసొచ్చిన అంశాలు ఇవే!
రేపు(గురువారం) సాయంత్రం బెంగుళూరులో సీఎల్పీ భేటీ జరగనుంది. కర్ణాటకలో సిద్ధరామయ్య ఇంటి దగ్గర భద్రత పెంచారు. రేపు ప్రమాణస్వీకారం ఉంటుందని సిద్ధూ అనుచరులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment