సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లో ఉన్న లోకా యుక్త కార్యాలయాన్ని ఏపీకి తరలించేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హై కోర్టుకు నివేదించింది. ఈ విషయంలో పలు నిబం ధనలకు సవరణలు కూడా చేశామని అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ వివరించారు. పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతానని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి, జీఏడీ ముఖ్య కార్యదర్శి, లోకా యుక్త రిజిస్ట్రార్‌లకు నోటీసులిచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
విజయవాడలోనే పెట్టాలని లేదు..
ఏపీలోకాయుక్త కార్యాలయం హైదరాబాద్‌లో ఉండటంతో, అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ ఈ అంశాన్ని హైకోర్టు సుమోటో పిల్‌గా విచారణకు తీసుకుంది. దీనిని సీజే ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. లోకాయుక్త కార్యాలయాన్నిఏపీకి తీసుకొస్తున్నామని వివరించారు. సీజే స్పందిస్తూ.. లోకాయుక్త కార్యాలయాన్ని విజయవాడలోనే పెట్టాలని ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ధర్మాసనం విచారణను ఆగస్టు 31కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment