
సాక్షి, హైదరాబాద్: లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ విలాస్ వి అఫ్జల్ పుర్కర్, ఉప లోకాయుక్తగా జిల్లా రిటైర్డ్ జడ్జి నిరంజన్ రావు, రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రయ్యను రాష్ట్ర ప్రభుత్వం నియమించనున్నట్లు తెలిసింది. వీరి ఎంపిక లాంఛనమేనని చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని ఎంపిక కమిటీలు గురువారం ప్రగతి భవన్‌లో సమావేశమై లోకాయుక్త, ఉప లోకాయుక్త, హెచ్‌ఆర్సీ చైర్మన్, సభ్యుల ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నాయి.