HRC Chairman
-
స్వాతంత్య్ర ఫలాలు పేదలకు అందాలి
కర్నూలు(సెంట్రల్): స్వాతంత్య్ర ఫలాలు పేదలకు అందినప్పుడే నిజమైన సంతృప్తి అని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) చైర్మన్ జస్టిస్ మంథాత సీతారామమూర్తి చెప్పారు. కర్నూలులోని హెచ్ఆర్సీ కార్యాలయంలో గురువారం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం ప్రపంచానికి దిక్సూచిగా, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాలకు నిలయంగా మారుతోందని చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన వారందరిని స్మరించుకోవడం పౌరుల బాధ్యత అని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలు సమన్వయంతో వ్యవహరించినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అంతకుముందు ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. హెచ్ఆర్సీ జ్యుడిషియల్ సభ్యుడు దండే సుబ్రమణ్యం, సిబ్బంది పాల్గొన్నారు. అసమానతలు బాధాకరం లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి దేశంలో నేటికీ ధనిక, పేదవర్గాలు, కులమతాలు, ప్రాంతీయ వ్యత్యాసాలు ఉండటం బాధాకరమని లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి చెప్పారు. కర్నూలులోని లోకాయుక్త కార్యాలయం ఆవరణలో గురువారం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రఫలాలు పౌరులందరికీ సమానంగా అందించేందుకు పాలకులు, అధికారులు కృషిచేయాలని కోరారు. చెస్, క్యారమ్స్, ముగ్గులు, క్రికెట్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. లోకాయుక్త ఇన్స్పెక్టర జనరల్ నరసింహారెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
బాధ్యతలు స్వీకరించిన హెచ్చార్సీ చైర్మన్
నాంపల్లి: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ) తొలి చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్య సోమవారం బాధ్యతలు చేపట్టారు. హెచ్చార్సీ సభ్యులుగా రిటైర్డ్ జిల్లా సెషన్స్ జడ్జి నడిపల్లి ఆనందరావు, నాన్ జ్యుడీషియల్ సభ్యులుగా మహ్మద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ న్యాయమూర్తులతో పాటు డీజీపీ మహేందర్‌రెడ్డి, శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్, నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ విచ్చేసి కమిషన్ చైర్మన్, సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. 2016, డిసెంబర్ వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు చివరి చైర్మన్‌గా జస్టిస్ సిస్సార్ అహ్మద్ కక్రూ పనిచేశారు. తదనంతరం కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకం జరగలేదు. ప్రస్తుతం తెలంగాణ పేరుతో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ప్రత్యేకంగా చైర్మన్, సభ్యులతో బెంచ్ ఏర్పాటైంది. నూతనంగా నియమితులైన చైర్మన్, సభ్యులు మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఈ సందర్భంగా జస్టిస్ జి.చంద్రయ్య మాట్లాడుతూ... ప్రాథమిక హక్కులే మానవ హక్కులని, వాటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. -
లోకాయుక్తగా జస్టిస్ పుర్కర్!
సాక్షి, హైదరాబాద్: లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ విలాస్ వి అఫ్జల్ పుర్కర్, ఉప లోకాయుక్తగా జిల్లా రిటైర్డ్ జడ్జి నిరంజన్ రావు, రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రయ్యను రాష్ట్ర ప్రభుత్వం నియమించనున్నట్లు తెలిసింది. వీరి ఎంపిక లాంఛనమేనని చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని ఎంపిక కమిటీలు గురువారం ప్రగతి భవన్లో సమావేశమై లోకాయుక్త, ఉప లోకాయుక్త, హెచ్ఆర్సీ చైర్మన్, సభ్యుల ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నాయి. -
ఆ పోస్టులను భర్తీ చేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర లోకాయుక్త, ఉప లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) చైర్మన్, సభ్యుల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. హెచ్ఆర్సీ, లోకాయు క్తల పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నా, వాటి భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని ఆక్షేపించింది. హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాలతోపాటు లోకాయుక్త, ఉప లోకాయుక్త పోస్టులను భర్తీ చేసి తీరాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం ప్రభుత్వాని కి తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఖమ్మం జిల్లా, లెనిన్ నగర్‌కు చెందిన వెంకన్న ఈ పిల్ దాఖలు చేశారు. -
హెచ్ఆర్సి చైర్మన్‌పై కేంద్రానికి ఫిర్యాదు
-
హెచ్ఆర్సి చైర్మన్‌పై కేంద్రానికి ఫిర్యాదు
హైదరాబాద్: రాష్ట్ర మానవ హక్కుల సంఘం(హెచ్ఆర్సి) చైర్మన్ నిసార్ అహ్మద్ కక్రూపై న్యాయవాది అజయ్ కేంద్ర హొం శాఖకు ఫిర్యాదు చేశారు. కక్రూ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అజయ్ ఫిర్యాదుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ నివేదిక సమర్పించాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. **