లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి గ్రేటర్ వరంగల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు సమన్లు జారీ చేశారు.
వరంగల్ అర్బన్ : లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి గ్రేటర్ వరంగల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు సమన్లు జారీ చేశారు. మహా నగరంలోని రామన్నపేట, సిటీలోని రెండు అపార్ట్‌మెంట్లు ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని వినియోగదారుల మండలి అధ్యక్షుడు సాంబరాజు చక్రపాణి నాలుగు నెలల క్రితం లోకాయక్తను ఆశ్రయించారు.
స్పందించిన లోకాయుక్త అనుమతుల పత్రాలు అందజేయూలని ఆదేశించింది. ఈ విషయమై టౌన్‌ప్లానింగ్ అధికారులు స్పందించకపోవడంతో పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుపడుతూ కమిషనర్ ఈనెల 31వ తేదీన తన ఎదుట హాజరుకావాలని శుక్రవారం లోకాయుక్త ఆదేశాలు జారీ చేశారు.