
లోకాయుక్త పంజా
అక్రమ మార్గంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు కలిగిన ఆరుగురు ప్రభుత్వ అధికారుల ఇళ్లు,
బెంగళూరు : అక్రమ మార్గంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు కలిగిన ఆరుగురు ప్రభుత్వ అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో లోకాయుక్త శనివారం సోదాలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా 21 చోట్ల ఏక కాలంలో నిర్వహించిన ఈ సోదాల్లో కోట్లాదిరుపాయాల స్థిర, చరాస్తులు బయటపడ్డాయని రాష్ట్ర లోకాయుక్త అదనపు డెరైక్టర్ జనరల్ ప్రేమ్‌శంకర్ మీన వెల్లడించారు. వివరాలు...
కొప్పల్‌లో ఆర్టీవోగా విధులు నిర్వర్తిస్తున్న పీ.జీ పాండురంగశెట్టి దాదాపు రూ.1.22 కోట్ల స్థిరచరాస్తులను కూడబెట్టారు. ఆదాయంతో పోల్చినప్పుడు వీటి విలువ 144 శాతం ఎక్కువ.
►బీదర్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీకు పీఏగా విధులు నిర్వర్తిస్తున్న అశోక్ జీ మహాలింగ ఆస్తుల విలువ అతని ఆదాయంతో పోల్చినప్పుడు 209 శాతం అధికం.
► హాసన్‌లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎం.దొరైస్వామి ఆదాయంతో పోల్చితే 103 రెట్ల అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారు.
► మండ్యాలోని హసబా హోబ్లీలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న దొడ్డయ్య దాదాపు రూ.1.23 కోట్ల స్థిర, చరాస్తులను కలిగి ఉన్నారు. వీటి విలువ అతని ఆదాయంతో పోల్చినప్పుడు 363 రెట్లు ఎక్కువ.
► శివమొగ్గాలో మైసూరు పేపర్ మిల్స్ లిమిటెడ్‌లో అసిస్టెంట్ జనరల్ మేనజర్‌గా ఉన్న జీవీ నంజయ్య దాదాపు రూ.1.30 కోట్ల స్థిర, చరాస్తులు కలిగి ఉన్నారు. ఆదాయంతో పోల్చినప్పుడు వీటి విలువ 145 రెట్లు ఎక్కువ.
► {పజాపనుల శాఖ మంగళూరు జిల్లా కార్యాలయంలో జూనియర్ ఇంజనీర్ అయిన అరుణ్‌ప్రకాశ్ డిసౌజా దాదాపు రూ.1.24 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. ఆదాయంతో పోల్చినప్పుడు వీటి విలువ 266 రెట్లు ఎక్కువ.