5,282 కేసులు పరిష్కరించాం
► ఈ ఏడాది మరింత సమర్థవంతంగా పనిచేస్తాం
► ఉమ్మడి రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, అవినీతిపై దాఖలైన 5282 కేసులను పరిష్కరించి ప్రజలకు న్యాయం అందించామని ఉమ్మడి రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి అన్నారు. శనివారం లోకాయుక్త కార్యాలయం ఆవరణలో ఈ ఏడాదిలో తన కార్యాలయం పనితీరుపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక్కడ దాఖలయ్యే కేసులు లోకాయుక్త పరిశీలనకు నెల తర్వాత వచ్చే వని, తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటనే తన ముందుకు వచ్చేలా నిబంధ నలను సరళతరం చేశానని వివరించారు. లోకాయుక్త కార్యాలయంపై ప్రజలకు విశ్వాసం ఏర్పడిందని, కేసుల సంఖ్య గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనమన్నారు.
నూతన సంవత్సరంలో మరింత సమర్థవం తంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. తమ సిబ్బంది పూర్తిగా సహకరించడం వల్లనే ప్రజలకు వీలైనంత త్వరగా న్యాయం అందించగలుగుతున్నామ న్నారు. తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్‌ను సిబ్బందికి అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ జగన్నాథరెడ్డి, దర్యాప్తు విభాగం డైరెక్టర్ నరసింహారెడ్డి, ఉన్నతాధికారులు శేఖర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, తాజుద్దీన్తదితరులు పాల్గొన్నారు.