గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందును ఎలుకలు కొరికిన ఘటనపై లోకాయుక్త విచారణ ప్రారంభమైంది.
గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందును ఎలుకలు కొరికిన ఘటనపై లోకాయుక్త విచారణ ప్రారంభమైంది. లోకాయుక్త ఉప సంచాలకుడు రాజ్‌కుమార్ శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఆస్పత్రికి చేరుకుని వైద్యాధికారులతో సమావేశమయ్యారు. ఆస్పత్రి వార్డులను, పరిసరాలను పరిశీలించారు. అనంతరం సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోకాయుక్త విచారణ ఈ నేపథ్యంలో ఆస్పత్రి వార్డులను సిబ్బంది యుద్ధప్రాతిపదికన శుభ్రం చేయటం ప్రారంభించారు.