
చేసేది గార్డు కొలువు... ఇంట్లో రూ. 22 కోట్లు
సాధారణంగా ప్రభుత్వ శాఖలో నాలుగోతరగతి స్థాయి ఉద్యోగి ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తే ఎంత దొరుకుతుంది.
సాధారణంగా ప్రభుత్వ శాఖలో నాలుగోతరగతి స్థాయి ఉద్యోగి ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తే ఎంత దొరుకుతుంది... మహా అయితే రూ. 10 వేలు లేదా రూ. 20 వేలు. ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో (చౌకీదారు) గార్డ్గా విధులు నిర్వర్తిస్తున్న గురు కృపాల్ సింగ్ ఇండోర్ నగరంలోని తిలక్ నగర్లో నివసిస్తున్నాడు. అతగాడి నివాసంపై శుక్రవారం లోకాయుక్త అధికారులు దాడులు నిర్వహించారు. సదరు గార్డుగారి నివాసంలో సంపద చూసి లోకాయుక్త అధికారుల కళ్లు బైర్లు కమ్మాయి.
లక్ష... పది లక్షలు కాదు.. కోటీ... పది కోట్లు కాదు ఏకంగా రూ. 22 కోట్ల అతడి సంపద చూసే సరికి అధికారులు నిర్ఘాంతపోయారు. ఇంట్లోనే రూ. 12 లక్షల 44 వేల నగదును కనుగోన్నారు. లెక్కకు మిక్కిలిగా ఆభరణాలు, పలు డాక్యుమెంట్ పేపర్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటీతోపాటు చాలా ఖరీదైన మూడు కార్లుతోపాటు రెండు ద్విచక్రవాహనాలను అధికారులు సీజ్ చేశారు. అంతేకాకుండా 14 ఇళ్లు, 20 ఏకరాల వ్యవసాయ భూమి కృపాల్ సింగ్ పేరుతో ఉన్నాయి. ఇంతకీ కృపాల్ సింగ్ నెల జీతం ఎంతో తెలుసా అక్షరాల రూ. 22 వేలు.