లోకాయుక్త స్థానానికి న్యాయమూర్తి ఎస్.ఆర్.నాయక్ పేరును సిఫార్సు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను గవర్నర్
లోకాయుక్త కోసం సిఫార్సు చేసిన ‘నాయక్’ పేరును తిరస్కరించిన గవర్నర్
బెంగళూరు: లోకాయుక్త స్థానానికి న్యాయమూర్తి ఎస్.ఆర్.నాయక్ పేరును సిఫార్సు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా తిరస్కరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో లోకాయుక్త నియామకం మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోకాయుక్త స్థానానికి న్యాయమూర్తి ఎస్.ఆర్.నాయక్ పేరును సిఫార్సు చేస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపించింది.
న్యాయమూర్తి ఎస్.ఆర్.నాయక్ పేరును సిఫార్సు చేసేందుకు ప్రతిపక్షాలు అంగీకరించకపోయినప్పటికీ సీఎం సిద్ధరామయ్య తన నిర్ణయమే ఫైనల్ అంటూ న్యాయమూర్తి ఎస్.ఆర్.నాయక్ పేరును గవర్నర్ పరిశీలనకు పంపారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి ఎస్.ఆర్.నాయక్‌కు బదులుగా మరొకరి పేరును సిఫార్సు చేయాలంటూ గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారని తెలుస్తోంది. గవర్నర్ నిర్ణయం కారణంగా సీఎం సిద్ధరామయ్యకు భారీ ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పవచ్చు.