Naik
-
ఎల్అండ్టీ గ్రూప్ కంపెనీలకు నాయక్ గుడ్‌బై
న్యూఢిల్లీ: ఎల్టీఐ మైండ్‌ట్రీ, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ (ఎల్టీటీఎస్) చైర్మన్‌గా తప్పుకోవాలని ఏఎం నాయక్ నిర్ణయించుకున్నారు. ఆయన స్థానంలో ఈ రెండు సంస్థలకు చైర్మన్‌గా ఎస్ఎన్ సుబ్రమణియన్ 27న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఇరు కంపెనీలు ప్రకటించాయి. వ్యవస్థాపక చైర్మన్‌గా ఏఎం నాయక్ ఎల్టీఐ మైండ్‌ట్రీ కంపెనీని చురుకైన అంతర్జాతీయ కంపెనీగా తీర్చిదిద్దినట్టు సంస్థ పేర్కొంది. ఈ నెల 26నాటి ఎల్టీఐ మైండ్‌ట్రీ 28వ ఏజీఎంతో తన బాధ్యతలకు ముగింపు పలకాలని ఏఎం నాయక్ నిర్ణయించుకున్నారని, దీంతో ప్రస్తుతం వైస్ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియన్‌ను నూతన చైర్మన్‌గా బోర్డు ఎంపిక చేసినట్టు, ఇది 27 నుంచి అమల్లోకి వస్తుందని ఎల్టీఐ మైండ్‌ట్రీ ప్రకటించింది. కంపెనీ పురోగతికి నాయక్ అందించిన సేవలకు అభినందనలు తెలియజేసింది.సుబ్రమణియన్ సారథ్యంలో ఎల్టీఐ మైండ్‌ట్రీ తన వృద్ధి పథాన్ని కొనసాగిస్తుందని, కొత్త విజయశిఖరాలను చేరుకుంటుందని ఆశిస్తున్నట్టు నాయక్ ప్రకటించారు. అంతకుముందు ఈ సంస్థ ఎల్అండ్టీ ఇన్ఫోటెక్గా కొనసాగగా, 2019లో మైండ్‌ట్రీని విలీనం చేసుకున్న అనంతరం ఎల్టీఐ మైండ్‌ట్రీగా మారడం తెలిసిందే. మైండ్‌ట్రీని సొంతం చేసుకోవడంలో నాయక్, సుబ్రమణియన్ కీలక పాత్ర పోషించారు. ఎల్టీఐ మైండ్‌ట్రీ, ఎల్టీటీఎస్ రెండింటిలోనూ ఎల్అండ్టీకి మెజారిటీ వాటాలున్నాయి. -
కంటోన్మెంట్లో స్కైవేలకు కేంద్రం ఓకే
హైదరాబాద్: ఎట్టకేలకు కంటోన్మెంట్లో ప్రతిపాదిత స్కైవేలు కేంద్రం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. స్కైవేల నిర్మాణానికి అవసరమైన రక్షణ భూముల కేటాయింపునకు ఇటీవలే అంగీకారం తెలిపిన కేంద్రం, తాజాగా స్కైవేల నిర్మాణానికి పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ బోర్డు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్ట్రాటజిక్ రోడ్స్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ పరిధిలో స్కైవేల నిర్మాణం చేపట్టనుంది. రాజీవ్ రహదారిపై ప్యాట్నీ చౌరస్తా నుంచి హకీంపేట వరకు సుమారు 14 కిలోమీటర్లు, నాగ్‌పూర్ హైవే మార్గంలో ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి చెక్‌పోస్టు వరకు సుమారు 6.5 కిలోమీటర్లు రెండు ఎలివేటెడ్ కారిడార్లుగా స్కైవేలు నిరి్మంచనున్నట్లు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలి ప్రతిపాదనలో ప్యారడైజ్ నుంచి సుచిత్ర సర్కిల్ వరకు స్కైవే నిరి్మంచాలని భావించినప్పటికీ, ఈ మార్గంలో సుచిత్ర నుంచి బోయిన్పల్లి చెక్‌పోస్టు వరకు ఫ్లైఓవర్ నిర్మాణం కొనసాగుతోంది. దీంతో ప్రతిపాదిత స్కైవేను బోయిన్పల్లి చెక్‌పోస్టు వరకు కుదించినట్లు తెలుస్తోంది. బీఓఓ కమిటీ ఏర్పాటు ►రక్షణ భూముల బదలాయింపునకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా కేంద్రం భాగస్వామ్య పక్షాలతో బోర్డ్ ఆఫ్ ఆఫీసర్స్ (బీఓఓ) కమిటీ ఏర్పాటు చేసింది. హెచ్ఎండీఏ, డిఫెన్స్ ఎస్టేట్స్ కార్యాలయం, లోకల్ మిలటరీ అథారిటీ, కంటోన్మెంట్ బోర్డుల నుంచి ఒక్కో ప్రతినిధి చొప్పున నలుగురు సభ్యులు ఈ కమిటీలో ఉంటారు. ►ప్రతిపాదిత ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం మొత్తం 150 ఎకరాల రక్షణ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించనున్నారు. ఇందులో 90 ఎకరాలు ఆర్మీకి సంబంధించిన స్థలాలు కాగా, కంటోన్మెంట్ బోర్డు స్థలాలు 30 ఎకరాలు, సివిల్ ఏవియేషన్ ఇతరత్రా మరో 30 ఎకరాలు ఉన్నాయి. ప్రైవేటు స్థలాలు వీటికి అదనం. ►ఈ మార్గాల్లో ప్రస్తుతం ఉన్న రోడ్లను 60 మీటర్లకు విస్తరించనున్నారు. ఈ మేరకు రాజీవ్ రహదారి, నాగ్‌పూర్ హైవేలో పెద్ద సంఖ్యలో ప్రైవేటు భవనాలు కనుమరుగు కానున్నాయి. ►బేగంపేట ఎయిర్‌పోర్టు, హకీంపేట ఎయిర్‌పోర్టు వంటి ప్రాంతాలకు సమీపంలో ఫ్లైఓవర్లకు బదులుగా టన్నెల్ రూపంలో రోడ్ల నిర్మాణం చేపట్టే అవకాశముంది. దీనిపై త్వరలోనే హెచ్ఎండీఏ పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వనుంది. ►ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కంటోన్మెంట్ బోర్డు 30 ఎకరాలకు పైగా స్థలాన్ని కోల్పోతున్నందున, అందుకు గానూ సుమారు రూ.300 కోట్ల పరిహారం ఇవ్వాలని బోర్డు అధికారులు కోరారు. అయితే కంటోన్మెంట్, ఆర్మీ, డిఫెన్స్ ఎస్టేట్స్, ఎయిర్‌ఫోర్స్ వంటి విభాగాలన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివే కాబట్టి, పరిహారం పూర్తిగా కేంద్రానికి చెందేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బోర్డుకు ఎలాంటి పరిహారం దక్కే అవకాశం లేకుండా పోయింది. ►తాజా భూకేటాయింపుల్లో భాగంగా కంటోన్మెంట్ బోర్డు బాలంరాయి పంప్ హౌజ్, బేగంపేట ఎయిర్‌పోర్టు, హకీంపేటలో ఎయిర్‌లైన్స్ స్థలాలు, కొన్ని ఓల్డ్ గ్రాంట్ బంగళాలు తమ స్థలాలను కోల్పోనున్నాయి. ముఖ్యంగా ఎన్సీసీ, ప్రతిష్టాత్మక సికింద్రాబాద్ క్లబ్ భారీ మొత్తంలో స్థలాలను కోల్పోనున్నాయి. -
ప్రజల హృదయాలను గెలుచుకున్నావు..
ఉట్నూర్‌రూరల్: రాజకీయాల్లో గెలుపోటములు స హజమని ఎన్నికల్లో ఓడిపోయిన ఖానాపూర్ ప్రజల హృదయాలను గెలుచుకున్నావని ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్‌నాయక్‌ను కేటీఆర్ అభినందించారు. జాన్సన్‌నాయక్ సోమవారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో కేటీఆర్ ఎన్నికల సరళిని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించి ప్రజల హృదయాలను గెలుచుకున్నావని కొనియాడారు. ఓటమితో అసంతృప్తి చెందకుండా రానున్న రోజుల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలన్నారు. -
గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని.. ఒక్కసారిగా భీమ్లానాయక్..
సంగారెడ్డి: మద్యం మత్తులో పచ్చి చికెన్ తినడంతో గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధి నవాబుపేట పంచాయతీ రాములు తండాలో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా హత్నుర మండలం కొత్తగూడం తండాకు చెందిన భీమ్లానాయక్(40) నాలుగు నెలల నుంచి రాములు తండాలోని అత్తగారి ఇంటి వద్ద ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దసరా సెలవులు కావడంతో భీమ్లానాయక్ ఇద్దరు కూతుళ్లు గురువారం హాస్టల్ నుంచి తండాకు వచ్చారు. వారి కోసం తెచ్చి ఉంచిన మాంసాన్ని మద్యం మత్తులో ఉన్న భీమ్లానాయక్ తిన్నాడు. దీంతో చికెన్ ముక్కలు గొంతులో ఇరుక్కోవడంతో కుటుంబ సభ్యులు నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవికాంత్రావ్ తెలిపారు. -
ఎల్అండ్టీ చైర్మన్‌గా వైదొలిగిన ఎ.ఎం. నాయక్
ప్రముఖ పారిశ్రామికవేత్త ఎ.ఎం. నాయక్ లార్సెన్ & టూబ్రో (L&T) నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా అధికారికంగా వైదొలిగారు. 23 బిలియన్ డాలర్ల వ్యాపార సమ్మేళనం నాయకత్వ బాధ్యతలను ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్‌కు అందించారు. 81 ఏళ్ల నాయక్ ఇక ఐటీ కంపెనీలు, ఉద్యోగుల ట్రస్ట్‌కు చైర్మన్‌గా ఉంటారని, గత కొన్నేళ్లుగా ఆయన చేపడుతున్న దాతృత్వ కార్యక్రమాలను మరింత పెంచడంపై దృష్టి సారిస్తారని ఎల్ అండ్ టీ ఒక ప్రకటనలో తెలిపింది. దాతృత్వంతో ప్రత్యేక గుర్తింపు ఎ.ఎం. నాయక్ పారిశ్రామిక, దాతృత్వ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ ఇండియన్ పోస్ట్ సంస్థ ఈ సందర్భంగా ఆయనపై ఒక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించింది. త్వరలో ప్రచురితం కానున్న ఎ.ఎం.నాయక్ జీవిత చరిత్ర పుస్తకం ‘ది మ్యాన్ హూ బిల్ట్ టుమారో’ ముఖచిత్రాన్ని ఎల్ అండ్ టీ మాజీ డైరెక్టర్లు, నాయక్ కుటుంబ సభ్యులు ఆవిష్కరించారు. నాయక్ ఛారిటబుల్ ట్రస్ట్ పేరుతో అణగారిన వర్గాల విద్య, నైపుణ్యాలను పెంపొందించడానికి ఎ.ఎం.నాయక్ కృషి చేస్తున్నారు. అలాగే నిరాలీ మెమోరియల్ మెడికల్ ట్రస్ట్ ద్వారా రాయితీ ధరకు సూపర్ స్పెషాలిటీ హెల్త్‌కేర్‌ను పేదలకు అందిస్తన్నారు. గుజరాత్లో ఉపాధ్యాయుల కుటుంబం నుంచి వచ్చిన నాయక్, 1965లో ఎల్అండ్టీ కంపెనీలో జూనియర్ ఇంజనీర్‌గా చేరారు. ఆరు దశాబ్దాలు ఆ సంస్థలో పనిచేసిన ఆయన 1999లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా, 2003లో ఛైర్మన్‌గా నియమితులయ్యారు. కంపెనీ బోర్డు ఆయనకు ఛైర్మన్ ఎమిరిటస్ హోదాను సైతం ప్రదానం చేసింది. -
ఎటువంటి గ్రూప్ గొడవలు లేకుండా చూస్తామన్న నేతలు
-
ప్రతిరోజూ నాకు నమస్కారం చేయండి..
ఒడిశా: ప్రతిరోజూ నాకు నమస్కారం చేయండి.. లేదంటే మీ పనులు నిలిపివేస్తాను అని ఒక మహిళా అధికారి తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలో బిసంటక్ సమితి పరిధిలోని జీవికా మిషన్ కార్యాలయంలో మానసీ టకిరి అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. తనకు ప్రతిరోజూ ఆఫీస్‌కు వచ్చిన వెంటనే సిబ్బంది మొత్తం నమస్కారం చేయడం లేదని, కొంతమంది గుడ్ మార్నింగ్తో సరిపెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అలాంటివి కొనసాగవని, అందరు తప్పకుండా నమస్కారం చేయాల్సిందేనని గట్టిగా చెప్పారు. అయితే ప్రతిరోజూ గుడ్ మార్నింగ్ చెబుతున్నాం కదా మేడం అని ఒక వ్యక్తి అంటున్నా ఆమె ససేమిరా అన్నారు. ఈ వీడియోను బిసంకటక్ బీడీవో సదాశివ నాయక్ దృష్టికి విలేకరులు తీసుకెళ్లగా, దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. -
గ్రౌండ్ జీరో హీరో
కళారూ΄ాలు అద్భుతాలకు మాత్రమే పరిమితం కానక్కర్లేదని చెబుతాయి సాహిల్ నాయక్ మినీయేచర్లు. అతడి కళాప్రపంచంలో నిర్మాణాల రూపంలో అసహాయుల హాహాకారాలు వినిపిస్తాయి. మహా నిర్మాణాలకు రాళ్లెత్తిన కూలీల జాడలు దొరుకుతాయి. పల్లకీ మోసిన బోయీల అడుగు జాడలు కనిపిస్తాయి.... గోవాలోని పొండలో పెరిగిన సాహిల్ నాయక్‌కు చిన్నప్పుడు ఒక్క దీపావళి పండగ వస్తే... వంద పండగలు వచ్చినంత సంబరంగా ఉండేది. రావణాసురుడి దిష్టి బొమ్మలను తయారుచేసే పనుల్లో బిజీ బిజీగా ఉండేవాడు. చిన్నప్పుడు నేర్చుకున్న బొమ్మలకళ ఊరకే పోలేదు. భవిష్యత్‌లో స్కల్ప›్టర్గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోడానికి పునాదిగా నిలిచింది. బరోడాలోని ఎంఎస్ యూనివర్శిటీలో చదువుకున్న సాహిల్ తన డెబ్యూ సోలో ఎగ్జిబిషన్‌ను ఆ యూనివర్శిటీ ప్రాంగణంలోనే ఏర్పాటు చేశాడు. ఆ తరువాతి షో కోల్‌కత్తాలోని ఎక్స్పెరిమెంటల్ గ్యాలరీలో జరిగింది. ‘గ్రౌండ్ జీరో’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌లోని మినీయేచర్లు కళాభిమానులను ఆకట్టుకున్నాయి. సాహిల్ కళాప్రపంచం గురించి చె΄్పాలంటే... అందానికి, అద్భుతానికి మాత్రమే పరిమితమై ఉంటే ‘గ్రౌండ్ జీరో’లో విశేషం ఉండేది కాదేమో! సాహిల్ మినీయేచర్స్ను ‘ఆర్టిస్టిక్ రిప్రెంజటేషన్’కు మాత్రమే పరిమితం చేయడం సరికాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే సాహిల్ కళా ప్రపంచంలో యుద్ధానంతర, ప్రకృతి విలయం తరువాత కట్టడాల కళ్లలో కనిపించే దైన్యం కదిలిస్తుంది. ప్రశ్నిస్తుంది. ప్రకృతి విలయాల తరువాత దృశ్యాలపై ఆసక్తితో వందలాది ఫొటోలను అంతర్జాలంలో చూసేవాడు. పాత పుస్తకాల్లో దృశ్యాల వెంట వెళ్లేవాడు సాహిల్. అద్భుతమైన ఆర్కిటెక్చర్ కొలువుదీరిన ఊళ్లను వెదుక్కుంటూ వెళ్లేవాడు. ఈ ప్రయాణంలో తనకు ప్రత్యేక ఆసక్తి కలిగించిన గ్రామాల్లో ఒకటి గోవాలోని కుర్దీ. డ్యామ్ నిర్మాణం వల్ల ఈ ఊళ్లోని వాళ్లు నిరాశ్రయులు అయ్యారు. ఎక్కడెక్కడికో వెళ్లి బతుకుతున్న వాళ్లు వేసవి సమయంలో మాత్రం తమ ఊరి ఆనవాళ్లను చూసుకోవడానికి తప్పకుండా వస్తారు. శిథిలమై, చిరునామా లేని ఊరిని తన కళలోకి తీసుకువస్తాడు సాహిల్. టెక్ట్స్, క్లిప్స్, రి΄ోర్ట్... తన అన్వేషణలో ఏదీ వృథా పోయేది కాదు. కొన్ని కట్టడాలను ఆర్ట్‌కి తీసుకురావడానికి ప్రత్యేకమైన పరికరాలను ఆశ్రయించడమో, తయారుచేయడమో జరిగేది. ‘ఆర్కిటెక్చర్ అనేది కళ కంటే ఎక్కువ. చరిత్రకు మౌనసాక్షి’ అంటాడు సాహిల్. ఆ మౌన సాక్షిని తన కళతో అనర్ఘళంగా మాట్లాడించడం సాహిల్ ప్రత్యేకత! ‘మాన్యుమెంట్స్, మెమోరియల్ అండ్ మోడ్రనిజం’ పేరుతో చేసిన సెకండ్ సోలో షోకు కూడా మంచి స్పందన లభించింది. చాలా మంది సాహిల్ మొదటి షో ‘గ్రౌండ్ జీరో: సైట్ యాజ్ విట్నెస్/ఆర్కిటెక్చర్ యాజ్ ఎవిడెన్స్’ తో ΄ోల్చుకొని మంచి మార్కులు వేశారు. ‘ఎక్కడా తగ్గలేదు’ అని ప్రశంసించారు. కోల్‌కత్తాలో జరిగినా, అక్కడెక్కడో జ΄ాన్లోని కాంటెంపరరీ ఆర్ట్స్ సెంటర్లో జరిగినా సాహిల్ ఎగ్జిబిషన్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన ఒక్కటే. ‘మన ఆలోచనల్లో ఉండే సంక్లిష్టతను కళలోకి తీసుకురావడం అంత తేలిక కాదు. సాహిల్ మాత్రం ఆ క్లిష్టమైన పనిని తేలిక చేసుకున్నాడు’ అంటారు ‘ఖోజ్’ గ్యాలరీ క్యూరెటర్, ్ర΄ోగ్రామ్ మేనేజర్ రాధ మహేందు. గోవాలో మొదలైన సాహిల్ ప్రయాణం అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. అయితే ‘గౌండ్ జీరో’ రూపంలో గ్రౌండ్ రియాలిటీకి ఎప్పుడూ దూరం కాలేదు. అదే అతడి విజయ రహస్యమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా! -
మరొకరి పేరు పంపండి
లోకాయుక్త కోసం సిఫార్సు చేసిన ‘నాయక్’ పేరును తిరస్కరించిన గవర్నర్ బెంగళూరు: లోకాయుక్త స్థానానికి న్యాయమూర్తి ఎస్.ఆర్.నాయక్ పేరును సిఫార్సు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా తిరస్కరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో లోకాయుక్త నియామకం మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోకాయుక్త స్థానానికి న్యాయమూర్తి ఎస్.ఆర్.నాయక్ పేరును సిఫార్సు చేస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపించింది. న్యాయమూర్తి ఎస్.ఆర్.నాయక్ పేరును సిఫార్సు చేసేందుకు ప్రతిపక్షాలు అంగీకరించకపోయినప్పటికీ సీఎం సిద్ధరామయ్య తన నిర్ణయమే ఫైనల్ అంటూ న్యాయమూర్తి ఎస్.ఆర్.నాయక్ పేరును గవర్నర్ పరిశీలనకు పంపారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి ఎస్.ఆర్.నాయక్‌కు బదులుగా మరొకరి పేరును సిఫార్సు చేయాలంటూ గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారని తెలుస్తోంది. గవర్నర్ నిర్ణయం కారణంగా సీఎం సిద్ధరామయ్యకు భారీ ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పవచ్చు. -
డీఈ నాయక్ ఇంటిపై ఏసీబీ దాడి
కడప : వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని నీటి పారుదల శాఖ డివిజనల్ ఇంజినీర్ నాయక్ ఇంటిపై ఏసీబీ అధికారులు బుధవారం దాడి చేశారు. అలాగే జిల్లాలోని హిందూపల్లి, రాయాచోటిలోని ఆయన బంధువులు నివాసాలపై కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. వారి నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ దాడుల్లో నాయక్ ఇంటిలో భారీగా ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. నాయక్‌కి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు బుధవారం దాడి చేశారు. -
పాస్‌పుస్తకాలకు లంచం డిమాండ్
విజయనగరం కంటోన్మెంట్ :పట్టాదారు పాస్‌పుస్తకాల మంజూరుకు వేపాడ మండల డిప్యూటీ తహశీల్దార్ బెంజుమన్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని మండలంలోని సింగరాయ గ్రామానికి చెందిన ఆర్. అప్పారావు, తదితరులు జేసీ బి. రామారావుకు ఫిర్యాదు చేశారు. ఎకరానికి ఇంత అని రేటు ఫిక్స్ చేసి డబ్బులు అడుగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కలెక్టర్ ఎం. ఎం నాయక్ సెలవులో ఉండడంతో జేసీ రామారావు సోమవారం గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. 202 వినతులు స్వీకరించి వాటి పరిష్కారినికి చర్యలు తీసకోవాలని సంబంధిత అధికారులను కోరారు. వచ్చిన వాటిలో కొన్ని ఫిర్యాదులు మీ సేవలో డబ్బులు అడుగుతున్నారు నెల్లిమర్ల మండల కేంద్రానికి మంజూరైన మీ సేవా కేంద్రాన్ని గుర్లలో నిర్వహించడంతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని నిర్వాహకుడు చింతాడ రాజుపై గుర్ల గ్రామానికి చెందిన మొదిలి వెంకటనాయుడు ఫిర్యాదు చేశారు. ఆధార్, అడంగల్, కుల, ఆదాయ, తదితర ధ్రువపత్రాల కోసం వెళ్లిన వారి నుంచి సాధారణ రుసుముతో పాటు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని జేసీ దృష్టికి తీసుకువచ్చారు. డబ్బును రికవరీ చేయాలి మక్కువ మండలం ఎం వెంకంపేటలో క్వారీ నిర్వహిస్తున్న మావుడి రంగునాయుడు అనే వ్యక్తికి నాలుగు ఎకరాలకు మాత్రమే అనుమతి ఉండగా 53 ఎకరాల్లో తవ్వకాలు జరిపి విలువైన రాయిని తరలించుకుపోతున్నాడని ఎంపీపీ పి. ఉమ ఫిర్యాదు చేశారు. ఆర్ ఆర్ యాక్టు ప్రకారం రాయితో పాటు డబ్బును రికవరీ చేయడంతో పాటు అతనిపై చర్యలు తీసుకోవాలని ఉమ, తిరుపతి, తదితరులు కోరారు. అమ్మకాలు నిలిపివేయాలి జిల్లా కేంద్రంలోని రింగురోడ్డు రైతుబజార్ పక్కనే ఉన్న రహదారిపై కూడా కూరగాయలు అమ్మడం వల్ల ట్రాఫిక్‌కు ఇబ్బంది ఏర్పడుతోందని పట్టణానికి చెందిన ఎంఎల్ నారాయణ, తదితరులు వినతి అందించారు. అమ్మకాలను నిలిపివేయాలని కోరారు. పంటలు కలుషితం పూసపాటి రేగ మండలం కందివలస వద్ద ఉన్న మైలాన్ పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాల వల్ల సమీపంలోని చెరువులు, ఆ నీటితో సాగయే పంట భూములు కలుషితమవుతున్నాయనీ కందివలస గ్రామస్థులు అప్పారావు తదితరులు ఫిర్యాదు చేశారు. ప్రజలు కూడా చర్మవ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్లు జేఈ దృష్టికి తీసుకువచ్చారు. పార్వతీపురం : గ్రీవెన్స్‌సెల్‌కు వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఐటీడీఏ ఏపీఓ జె వసంతరావు సిబ్బందిని ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలోని పీఓ చాంబరులో గ్రీవెన్స్‌సెల్ నిర్వహించి అర్జీలు స్వీకరించారు. బాడంగి మండలం పిండ్రంగివలస గ్రామస్తుడు అప్పన్నదొర వ్యవసాయానికి ఆయిల్ ఇంజన్ మంజూరు చేయాలని, సీతానగరం మండలం బక్కుపేట గ్రామానికి చెందిన జి.అప్పారావు గ్రామంలో బోరుబావి ఏర్పాటు చేయాలని, మక్కువ మండలం చెముడు గ్రామానికి చెందిన సిర్లాపు రామకృష్ణ జిరాక్స్ మిషన్ మంజూరు చేయాలని వినతులు అందించారు. గుమ్మలక్ష్మీపురం మండలం బల్లేరు గూడ గ్రామానికి చెందిన టి.భాస్కరరావు గ్రామానికి రహదారి ఏర్పాటు చేయాలని, కురుపాం మండలం పి.లేవిడి గ్రామస్తుడు ఎ.శాంతికుమారి స్మార్ట్‌కార్డు కావాలని కోరుతూ దరఖాస్తులు అందించారు. గుమ్మలక్ష్మీపురం మండలం మంత్రజోడుకు చెందిన పి. అలాజీ గ్రామానికి రహదారి వేయాలని, పార్వతీపురం మండలం తేలునాయుడువలస గ్రామానికి చెందిన దండాసి సన్యాసిరావు భూ పట్టాలు మంజూరు చేయాలని కోరారు. అలాగే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏఓ టి.రామకృష్ణ నిర్వహించిన గ్రీవెన్స్‌లో పలువురు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలు కావాలని వినతులు సమర్పించారు. ఐదు ఫిర్యాదుల స్వీకరణ విజయనగరం క్రైం : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ గ్రీవెన్స్‌సెల్ నిర్వహించి ఐదు ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్‌బ్రాంచి సీఐలు వి.లీలారావు, కృష్ణారావు, ఎస్సై కె. రామారావు, తదితరులు పాల్గొన్నారు. కొన్ని ఫిర్యాదులు విజయనగరం పట్టణంలోని ఎస్వీఎన్ నగర్‌కు చెందిన ఎం.గీత ఎస్పీతో మాట్లాడుతూ, తన కుమారుడు సందీప్ మెరైన్ ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉద్యోగం కోసంప్రయత్నం చేస్తుండగా, మీరట్‌కు చెందిన కులదీప్‌కుమార్ సింగపూర్‌లో మెరైన్షిప్పింగ్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 3,11,000 రూపాయలు తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. మూడు సంవత్సరాలుగా తన భర్త కానిస్టేబుల్ ఎం. ప్రసాద్ తనను వేధిస్తున్నట్లు మెంటాడ మండలం తమ్మిరాజుపేట గ్రామానికి చెందిన ఎం.సరోజిని ఫిర్యాదు చేసింది. తన భార్య ఎల్లమ్మ ప్రతినెలా రూ.50 చొప్పున డ్వాక్రా సంఘానికి చెల్లించినప్పటికీ ఆర్. సన్యాసిరావు అనే వ్యక్తి ఆ సొమ్మును దుర్వినియోగం చేసినట్లు నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామానికి చెందిన ఆర్.సూర్యనారాయణ ఫిర్యాదు చేశారు. -
రోగులంటే అంత చులకనా?
నేలపై చిందరవందరగా ఖరీదైన మందులు స్టోర్ రూమ్‌లో కొత్త దిండ్లు, పరుపులు చిరిగిన దిండ్లు, పరుపులపై రోగుల అవస్థలు కోడ్ పాటించకుండా విధులకు హాజరైన వైద్యుడు మండిపడ్డ కో-ఆర్డినేటర్ డాక్టర్ నాయక్ రోగుల కోసం పంపిన పరుపులు స్టోర్ రూమ్‌లో మూలుగుతున్నాయి. రోగుల మంచాలపై చిరిగిపోయిన దిండ్లు, పరుపులు దర్శనమిస్తున్నాయి. ఖరీదైన యాంటీబయాటిక్ ఇంజక్షన్లు చిందరవందరగా నేలపై పడిఉన్నాయి. స్టాకు రిజిస్టర్లో మందుల వివరాలు అసమగ్రంగా ఉన్నాయి. నక్కపల్లి ముప్ఫయ్ పడకల ఆస్పత్రి సిబ్బంది పనితీరిది. వైద్య విధాన పరిషత్ జిల్లా కో-ఆర్డినేటర్ నాయక్ సోమవారం జరిపిన ఆకస్మిక తనిఖీల్లో బయటపడిన నిర్లక్ష్యమిది. నక్కపల్లి, న్యూస్‌లైన్: విధి నిర్వహణలో అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న నక్కపల్లి 30 పడకల ఆస్పత్రి సిబ్బందిపై వైద్యవిధాన పరిషత్ జిల్లా కో-ఆర్డినేటర్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల జీవితాలతో ఆటలాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఆయన సోమవారం నక్కపల్లి 30 పడకల ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మందులను భద్రపరిచే గదిని పరిశీలించి అక్కడ రోగులకు వాడే అత్యంత ఖరీదైన మందులు చెల్లా చెదురుగా పడి ఉండటంపై ఫార్మసిస్టు, ఆస్పత్రి సిబ్బందిపై మండిపడ్డారు. డంపింగ్ యార్డ్‌ను తలపిస్తున్న స్టోర్ రూం సీడీసీ నుంచి తీసుకొచ్చిన మందులకు రిజిస్టర్‌ను నిర్వహించకపోవడం, రోగుల కోసం ప్రభుత్వం సరఫరాచేసిన బెడ్లను స్టోర్‌రూంలో భద్రపరచడాన్ని కూడా తప్పుపట్టారు. రోగులు చిరిగిపోయిన బెడ్లపై, దిండ్లు లేకుండా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం సరఫరా చేసిన పరుపులు, దిండ్లను స్టోర్‌రూంలో భద్రపరచడం సరికాదన్నారు. డాక్టర్ల గదుల్లో కొత్త పరుపులు వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆస్పత్రి నిర్వహణ అధ్వానంగా ఉందని, వైద్యాధికారుల పర్యవే క్షణ కొరవడిందన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే ఖరీదైన మందులను భద్రపరచాల్సిన స్టోర్‌రూం డంపింగ్ యార్డు ను తలపిస్తోందన్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన పరుపులను తక్షణమే వార్డుల్లోని మంచాలపై వేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో మూలుగుతున్న రూ.లక్షల నిధులతో రోగులకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అనంతరం ఎన్ బీఎస్ యూనిట్‌ను సందర్శించారు. పుట్టిన శిశువు పచ్చకామెర్లు, ఉబ్బసం, ఊపిరాడక, ఉష్ణోగ్రత సరిపోక ఇబ్బందిపడితే కాపాడేందుకు ప్రభుత్వం ఈ ఆస్పత్రిలో నూబోర్న్స్స్టెబిలైజేషన్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. అసలు ఇక్కడ ఆ సౌకర్యం ఉన్నట్లు ఎవరికీ తెలియదు. ఈ సౌకర్యం ఉన్నట్లు అందరికి తెలియజేయాలని అక్కడి ఏఎన్ఎంకు సూచించారు. ఒక వైద్యుడు టీ షర్ట్, జీన్ ప్యాంట్ ధరించి విధులకు హాజరుకావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఈ దుస్తుల్లో మిమ్మల్ని రోగులు చూస్తే వైద్యుడని భావిస్తారా?, డ్రస్ కోడ్ పాటించి హుందాగా డ్యూటీ చేయండని’ డాక్టర్ నాయక్ హితవు పలికారు. డ్రస్ కోడ్ పాటించని సిబ్బందిని విధులకు హాజరుకానీయొద్దని వైద్యాధికారి పూర్ణచంద్రరావును ఆదేశించారు. సేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. రేపటినుంచి విధులకు రాకు యాంటీ బయాటిక్ ఇంజక్షన్లు, మందులను గదిలో ఎక్కడిపడితే అక్కడ చిందరవందరగా పడేసిన ఫార్మసిస్టుపై డాక్టర్ నాయక్ మండిపడ్డారు. ‘నువ్వు ఎంతోమందితో రికమండేషన్లు చేయిస్తే తప్పని పరిస్థితుల్లో నీకు ఉద్యోగం ఇవ్వాల్సి వచ్చింది. ఇలా బాధ్యతారాహిత్యంగా విధులు నిర్వహిస్తావా? రేపటి నుంచి డ్యూటీకి రాకు. అవసరానికి మించి స్టాకు తీసుకొచ్చి ఇష్టానుసారం పడేసావు. ఎక్కడైనా మందుల కొరత ఏర్పడితే నేనేం చేయాలి? ఏమని సమాధానం చెప్పాలి?’ అని నిలదీశారు. తీసుకొచ్చిన మందుల వివరాలను రికార్డుల్లో రాయకపోవడాన్ని కూడా తప్పుబట్టారు. పాము, కుక్కకాటు ఇంజక్షన్లకు జిల్లా వ్యాప్తంగా తీవ్ర కొరత ఉంది. ఈ ఆస్పత్రిలో మాత్రం అవసరానికి, డిమాండ్‌కు మించి స్టాకు ఉన్నాయి. ఇంత ఎక్కువ మొత్తంలో స్టాకు తీసుకువచ్చి సక్రమంగా భద్రపరచ కపోవడంపై డాక్టర్ నాయక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. -
పేదలకు బాధ్యతగా వైద్యం
డాక్టర్లకు వైద్య విధాన పరిషత్ జిల్లా కో ఆర్డినేటర్ హితవు తీరు మారాలని ఏరియా ఆస్పత్రి డాక్టర్లకు సూచన ఉద్యోగుల కోసం ప్రత్యేక గదులు నిర్మిస్తున్నామని వెల్లడి నర్సీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : ఆస్పత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని వైద్యాధికారులను వైద్య విధాన పరిషత్ జిల్లా కో-ఆర్డినేటర్ నాయక్ సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆయన స్థానిక ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. మొదటగా సాధారణ విభాగంలో రోగుల కేస్‌షీట్‌ను పరిశీలించారు. కేస్‌షీట్‌లో రోగానికి సంబంధించిన వివరాలు లేకపోవడంతో వైద్యులకు హితవు చెప్పారు. కేస్‌షీట్‌లో ఉన్న కాలమ్‌లలో రోగి వివరాలను నమోదు చేయాలన్నారు. రోగుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించారన్న పేరు తెచ్చుకోవద్దన్నారు. ఆస్పత్రికి ప్రధానంగా పేదలే వస్తారు కనుక వైద్యులు ఉద్యోగధర్మంతోపాటు సేవానిరతిని కూడా చూపాలని కోరారు. ఇకనుండి కేస్‌షీట్‌లో రోగి వివరాలు సక్రమంగా ఉండాలని సూచించారు. రోగుల వద్దకు వెళ్లి స్వయంగా పరీక్షించారు. రోగుల ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా వైద్యసేవలందకపోవడంతో వైద్యులను మందలించారు. వార్డుల్లో రోగులను, ప్రసూతి విభాగాన్ని పరిశీలించారు. ప్రసూతి విభాగంలో ఫ్రిజ్ పనిచేయకపోవడంతో ఆస్పత్రి అభివృద్ధి నిధుల నుండి రెండు ఫ్రిజ్‌లు, ఇన్వర్టర్ కొనుగోలు చేయాలని జూనియర్అసిస్టెంట్ను ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎంప్లాయిస్ హెల్త్‌స్కీమ్ ద్వారా జిల్లాలో పలు ఆస్పత్రుల్లో ప్రత్యేక గదులు అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు తెలిపారు. చింతపల్లిలో 15 పడకలు, అరకులో 15 పడకలు, పాడేరులో 15, నర్సీపట్నంలో 15, అనకాపల్లిలో 25, అగనంపూడి పీహెచ్సీలో 15 ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. నర్సీపట్నంలో ఇప్పటికే ఉన్న గదులను రీమోడలింగ్ చేయాల్సి ఉందని చెప్పారు. చింతపల్లిలో, అరకులో కొత్తగా ప్రత్యేక గదుల నిర్మాణం కొనసాగుతున్నట్టు తెలిపారు. వీటి ద్వారా ఉద్యోగులకు ఏరియా ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు లభిస్తాయన్నారు. ప్రసవాల లక్ష్యాన్ని అధిగమించడంతో ఆస్పత్రికి రాష్ట్రంలో మంచిపేరు ఉందని చెప్పారు.