కడప : వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని నీటి పారుదల శాఖ డివిజనల్ ఇంజినీర్ నాయక్ ఇంటిపై ఏసీబీ అధికారులు బుధవారం దాడి చేశారు. అలాగే జిల్లాలోని హిందూపల్లి, రాయాచోటిలోని ఆయన బంధువులు నివాసాలపై కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. వారి నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.
అయితే ఈ దాడుల్లో నాయక్ ఇంటిలో భారీగా ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. నాయక్కి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు బుధవారం దాడి చేశారు.