లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇరిగేషన్ డీఈ
Published Fri, Dec 23 2016 2:27 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో లంచం తీసుకుంటూ ఇరిగేషన్ డీఈ ఆంజనేయులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మిషన్ భగీరథ పనులకు సంబంధించిన చెల్లింపుల నిధులు విడుదల చేసేందుకు ఓ కాంట్రాక్టర్‌ను డీఈ రూ.15 వేలు లంచం అడిగాడు. ఈ విషయం గురించి కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. బాధితుడి నుంచి డీఈ లంచం తీసుకుంటుండగా వరంగల్ రేంజ్ డీఎస్పీ సాయిబాబా పథకం ప్రకారం పట్టుకున్నారు. డబ్బు స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement